HHVM Day 1 Collections : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ జోడిగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’.. భారీ అంచనాలతో ఈ మూవీ థియేటర్లలోకి రిలీజ్ అయింది.. ఐదేళ్లుగా సెట్స్ మీదనే ఉన్న ఈ మూవీ ఇన్నాళ్లకు ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీగా భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే బుధవారం రాత్రే ప్రీమియర్ షోలు ప్రదర్శించగా, టిక్కెట్ రేట్లు పెరిగినప్పటికీ మంచి స్పందన లభించింది. పాజిటివ్ టాక్ ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. మరి ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఒకసారి చూసేద్దాం..
‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?
హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన ఒక రోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ సినిమాకు సుమారుగా 12 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. నైజాంలో 5 కోట్లకుపైగా వసూళ్లు నమోదు అయ్యాయి. 7 కోట్లకుపైగా ఆంధ్రాలో రాబట్టింది. అటు ఓవర్సీస్ లో కూడా భారీగానే వసూల్ చేసిందని టాక్. దాదాపుగా 700 k అంటే 6 కోట్లు వసూల్ చేసిందని టాక్.. మొత్తం అన్ని ఏరియాల్లో భారీగానే వసూల్ అయ్యాయని సమాచారం.. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ విషయానికొస్తే.. 52 కోట్లు వసూల్ చేసిందని తెలుస్తుంది. మరి మొదటి రోజు ఎన్ని కోట్లు వసూల్ చేసిందన్న విషయం పై మేకర్స్ క్లారిటీ ఇవాల్సి ఉంది. వీకెండ్ కావడంతో కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని టాక్..
మూవీ బడ్జెట్ & టార్గెట్ ఎంత..?
పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఏం అయ్యాక మొదటగా వచ్చిన మూవీనే హరిహర వీరమల్లు.. ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్ తో పాటు ఎందరో ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. ఏం ఏం కీరవాణి సంగీతాన్ని అందించారు. జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్క్రీన్లలో రిలీజైంది..
Also Read : ఎంతపని చేశావు గీతూ.. బన్నీ పరువు తీసేసావుగా.. ఫ్యాన్స్ ట్రోల్స్..
బడ్జెట్ విషయానికొస్తే..
టాప్ టెక్నీషియన్లు కూడా పనిచేయడం విశేషం. రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్స్ ఖర్చులన్నీ కలుపుకొని ఈ చిత్రానికి రూ.250 కోట్లు పెట్టుబడి అయ్యిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.. తొలిసారిగా పవన్ కళ్యాణ్ నుంచి పాన్ ఇండియా చిత్రం రిలీజ్ కాబోతుండటంతో సినిమాకు భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ట్రేడ్ నిపుణులు లెక్కల ప్రకారం ఈ చిత్రానికి ఇండియాలో రూ.117 కోట్ల బిజినెస్, ఓవర్సీస్ లో మరో 10 కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి రూ.127 కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం.. 52 కోట్లు ఫస్ట్ డే వసూల్ అయ్యాయి.. ఈ వీకెండ్ లోనే బడ్జెట్ కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ పంతుల్లు అంచనా వేస్తున్నారు.. చూడాలి ఏ మేర వసూల్ చేస్తుందో..