BigTV English

AP News : లవ్లీ డేటింగ్.. కోనసీమ కుర్రది, బెజవాడ పోటుగాడు.. కట్ చేస్తే..

AP News : లవ్లీ డేటింగ్.. కోనసీమ కుర్రది, బెజవాడ పోటుగాడు.. కట్ చేస్తే..

AP News : మాటలు నమ్మొద్దు. హద్దులు దాటొద్దు. హోటల్ గదికి వెళ్లొద్దు. కాలు అస్సలే జారొద్దు. ఒక్కసారి లైన్ క్రాస్ అయ్యారో.. ఇక అంతే సంగతి. జరిగే డ్యామేజ్‌ను ఎవరూ ఆపలేరు. ఆ తర్వాత బాధపడినా.. ఏడ్చినా.. పోలీసులకు కంప్లైంట్ చేసినా.. ఏం ప్రయోజనం. అలాంటిదే ఓ కేసు నేటితరం యువతీయువకులకు మంచి గుణపాఠంగా నిలుస్తుంది.


అసలేం జరిగిందంటే..

కోనసీమ జిల్లాకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం విజయవాడకు వచ్చింది. వెటర్నరీ కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటోంది. నెల రోజుల క్రితం కిలారి నాగతేజతో లవ్లీ డేటింగ్ యాప్‌లో పరిచయమైంది. వాళ్లిద్దరూ రోజూ ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. ఇక మాట్లాడుకుంది చాలు.. ఏకాంతంగా కలుద్దాం అనుకున్నారు ఇద్దరు. ఓ హోటల్‌లో రూమ్ బుక్ చేశాడు నాగతేజ. ఏప్రిల్ 22న ఆ ఇద్దరూ హోటల్ గదిలో ఎంజాయ్ చేశారు. కట్ చేస్తే.. ఆమెకు తెలీకుండా యువతి నగ్న వీడియోలు తీశాడు నాగతేజ. కత్తి చూపించి యువతి ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకుని పారిపోయాడు.


షాక్ నుంచి తేరుకున్నాక.. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నాగతేజను అరెస్ట్ చేశారు. అతని నుంచి 2 లక్షల క్యాష్, 20 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

వ్యసనాలకు బానిసైన నాగతేజ.. డబ్బుల కోసం ఇలానే చాలా మంది యువతులను మోసగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ పలువురు యువతులను మోసం చేసిన నాగతేజ.. జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదని చెప్పారు. డేటింగ్ యాప్, టెలిగ్రామ్, ఫేస్ బుక్, ఇన్‌స్టా గ్రామ్ ద్వారా జరిగే మోసాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ దామోదర్ హెచ్చరించారు.

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×