రివ్యూ : బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్
నటీనటులు : త్సుయోషి కుసనాగి, కనాటా హోసోడా, నాన్, మచికో ఓనో, జున్ కనమే, హనా టోయోషిమా తదితరులు
ఓటీటీ : నెట్ ఫ్లిక్స్
దర్శకత్వం : షింజీ హిగుచీ
Bullet Train Explosion Review : బుల్లెట్ ట్రైన్ అనగానే గుర్తొచ్చేది జపాన్. నిమిషానికి వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళే బుల్లెట్ ట్రైన్ లో బాంబ్ పెడితే ఏం జరుగుతుంది? అనే స్టోరీతో రూపొందిన మూవీనే ‘బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్’. ఈ జపాన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 1975లో వచ్చిన “ది బుల్లెట్ ట్రైన్” చిత్రానికి రీమేక్. ఈ సినిమా ఏప్రిల్ 23న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. సినిమా తెలుగు, తమిళ డబ్బింగ్ వెర్షన్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. షింజీ హిగుచీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మరి ఈ ట్రైన్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
కథ
హయబుసా నం. 60, షిన్-అయోమోరి నుండి టోక్యోకు బయలుదేరుతుంది ఒక ఈ5 సిరీస్ షింకన్సెన్ ట్రైన్ (బుల్లెట్ ట్రైన్). ట్రైన్ కండక్టర్ కజుయా తకైచీ (త్సుయోషి కుసనాగి) నేతృత్వంలో రన్ అవుతున్న ఈ ట్రైన్ లో 300ల మందికి పైగా ప్రయాణికులు జర్నీ చేస్తారు. ఈ క్రమంలోనే ఓ ఆకాశ రామన్న జేఆర్ ఈస్ట్ హెడ్ క్వార్టర్స్‌కు ఫోన్ చేసి, ట్రైన్‌లో బాంబు పెట్టానని చెబుతాడు. ట్రైన్ వేగం 100 కి.మీ./గం కంటే తగ్గితే బాంబు పేలుతుందని, 100 బిలియన్ యెన్ (జపాన్ డబ్బులు) ఇస్తేనే దాన్ని ఎలా ఆపాలో చెబుతానని డిమాండ్ చేస్తాడు. ఈ బెదిరింపు నిజమని నిరూపించడానికి, మరో ట్రైన్‌లో ఉన్న మరో బాంబును పేల్చి చూపిస్తాడు. దీంతో రైల్వే సిబ్బంది నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా అందరూ అప్రమత్తం అవుతారు. ఇక్కడ నుండి కథ కీలక మలుపు తిరుగుతుంది. ప్రయాణీకులను కాపాడేందుకు ట్రైన్ సిబ్బంది, రైల్వే అధికారులు ట్రై చేస్తుంటే, మరోవైపు ప్రయాణీకుల మధ్య గొడవ మొదలవుతుంది. మరి చివరకి ఆ ట్రైన్ లోని ప్రయాణికులను ఎలా కాపాడారు ? ట్రైన్ లో బాంబ్ పెట్టింది ఎవరు? ఇలాంటి దారుణానికి ఒడిగట్టడానికి కారణం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.
విశ్లేషణ
“బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్” ఒక యాక్షన్ థ్రిల్లర్. జపాన్ రైల్వే సిస్టమ్ సాంకేతిక వివరాలను, సాధారణ వ్యక్తుల హీరోయిజాన్ని ఆకట్టుకునే విధంగా సినిమాను తెరకెక్కించారు. ఇందులో హీరో ఏ ఒక్కరూ కాకపోవడం గమనార్హం. కొన్ని చిన్న లోపాలు ఉన్నప్పటికీ, థ్రిల్లర్ ప్రియులకు నచ్చే మూవీనే. 2 గంటల 10 నిమిషాల పాటు ఉన్న ఈ మూవీ కొన్నిచోట్ల సాగదీసిన ఫీలింగ్ వస్తుంది. ట్విస్ట్ లు ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ, బాంబ్ పెట్టిన వ్యక్తి గతం, మోటివ్ అంత థ్రిల్లింగ్ గా అన్పించవు. క్లైమాక్స్ బాగుంది. ట్రైన్‌ను అధిక వేగంతో నడపడం, ట్రాక్‌లను మార్చడం, బాంబును నిర్వీర్యం చేయడానికి చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ సహకారంతో, నిజమైన బుల్లెట్ ట్రైన్‌లు, రైల్వే సౌకర్యాలను ఉపయోగించి చిత్రీకరించడం వల్ల ఈ చిత్రం రియలిస్టిక్ గా కనిపిస్తుంది. అధునాతన విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఆకట్టుకుంటాయి. త్సుయోషి కుసనాగి, కనాటా హోసోడా, హనా టోయోషిమా వంటి నటుల యాక్టింగ్ బాగుంది.
ప్లస్ పాయింట్స్
సస్పెన్స్, ట్విస్ట్ లు
విజువల్స్, రియలిజం:
సామాన్యులే హీరోలు
నటీనటుల యాక్టింగ్
నెగెటివ్ పాయింట్స్
రన్‌టైమ్
CGI క్వాలిటీ
కథ
Read Also : ‘హవోక్’ మూవీ రివ్యూ
చివరగా
దీనికన్నా ధనుష్ నటించిన ‘రైలు’ మూవీ బెటర్. కానీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు ఎలాంటి అంచనాలు లేకుండా ఓసారి చూడవచ్చు.
Bullet Train Explosion Rating : 2/5