BigTV English

Lucknow Murder Case : హోటల్ గదిలో ఐదుగురు యువతుల హత్య.. న్యూఇయర్ సెలబ్రేషన్స్ లో దారుణం.. ఏమైందంటే

Lucknow Murder Case : హోటల్ గదిలో ఐదుగురు యువతుల హత్య.. న్యూఇయర్ సెలబ్రేషన్స్ లో దారుణం.. ఏమైందంటే

Lucknow Murder Case : నూతన వేడుకల కోసం ఆగ్రా వచ్చిన ఓ కుటుంబం.. తెల్లవారే వరకు అంతా శవాలుగా మారిపోయారు. ఓ యువతి ఆమె నలుగురు కుమార్తెలు దారుణంగా హత్యకు గురయ్యారు. దీంతో లక్నో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హోటల్ గదిలో ఓకే కుటుంబానికి చెందిన మహిళలందరినీ ఎందుకు చంపారు.? ఎవరు చంపారు.? అనే ఆందోళనలు చెలరేగాయి. కాగా.. ఈ కేసు దర్యాప్తులో వెలుగు చూస్తున్న వాస్తవాలతో మతిపోతుంది. హత్య చేసిన వారు, హత్యకు దారితీసిన కారణాలు తెలుసుకుని పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ.. అసలు ఏం జరిగిందంటే..


ఆగ్రా కు చెందిన ఓ కుటుంబం నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకని లక్నో నగరానికి వచ్చారు. అక్కడి నాకా అనే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో గదిని అద్దెకు తీసుకుని వేడుక నిర్వహించుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే.. అలియా (9) అలీషియా (19) అక్సా (16) రహీమ (18) అనే యువతులతో పాటు వారి తల్లి అస్మా దారుణ హత్యకు గురయ్యారు.

ఒకే కుటుంబానికి చెందిన ఈ ఐదుగురిని దారుణంగా హత్య చేసింది.. వీరి కుటుంబ సభ్యుడైన అర్షద్ గా పోలీసుల గుర్తించారు. తన నలుగురు సోదరీమణులు, తల్లిని హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో అర్షద్ అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ హత్యలు ఎందుకు చేశాడనే విషయమై ఇప్పుడు ఆందోళనలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఆగ్రాలో నివాసం ఉండే అర్షద్ కుటుంబంలో ఆడపిల్ల ఉండడంతో.. తను, తన తండ్రి లేకపోతే వారంతా ఏమైపోతారనే భయం ఎక్కువగా ఉంటుండేది. తల్లిని, చెల్లెలను ఎవరైనా ఏమైనా అంటారేమో అనే భయం వెంటాడుతుండేది. ఆడపిల్లల భవిష్యత్తు ఏంటనే కంగారు వేధిస్తుండేది. ఈ భయంతోనే ఇంట్లోని ఆడవారందరినీ చంపాలని నిర్ణయించుకున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ రవీనా ఠాగూర్ తెలిపారు.


అర్షద్ అతన కుటుంబాన్ని లక్నోకు తీసుకొచ్చేముందు అజ్మీర్ కి తీసుకెళ్లాడు. అక్కడ వారిని ఓ హోటల్లో ఉంచాడు. కుటుంబ సభ్యులు అంతా నిద్రపోయిన తర్వాత మొదటిగా తన తల్లిని దుప్పటితో గొంతు నులిపి, నోట్లో గుడ్డలు కుక్కి హతమార్చాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా వారి చెల్లెలను నిందితుడు హత్య చేశాడు. వారు కేకలు వేయకుండా వారి నోట్లో గుడ్డలు కుక్కి, వారి మణికట్లను కత్తిరించాడు. దాంతో వారు విలవిలాడుతూ చనిపోయారు. ఈ విషయాన్ని అర్షద్ అంగీకరించాడు.

హత్యలు చేసిన తర్వాత అర్హద్ ఆన్ లైన్లో వీడియోను పోస్ట్ చేశాడు. తన తల్లి, సోదరీమణుల చనిపోయి పడి ఉండడాన్ని వీడియోలో చూపించాడు. కొన్నాళ్లుగా తాను విపరీతమైన ఒత్తిడిలో ఉన్నట్లు చెబుతున్న  చెప్తున్నా అర్షద్ తన చెల్లెలు, సోదరీమనుల గౌరవాన్ని కాపాడేందుకే అలా చేశానంటూ తెలిపాడు. ఇటీవల ఇరుగుపొరుగు వారి నుంచి తన కుటుంబానికి ఇబ్బందులు వస్తుండగా… స్థానిక పోలీసులు కానీ, స్థానిక నాయకులు ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదని తెలిపాడు. ఆ పరిస్థితులే తనను ఈ హత్యల చేసేలా ప్రేరేపించాయని వెల్లడించాడు.

అయితే ఈ హత్యలకు అతని తండ్రి  బదర్ సైతం సహకరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అర్షత్ తండ్రి బదర్ ప్రోత్సాహంతోనే.. అతను ఈ నేరానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. హత్యలు చేసిన తర్వాత వీడియోని సామాజికమధ్మమాల్లో పంచుకున్న యువకుడు.. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. హత్య చేసేందుకు ఉపయోగించిన బ్లేడు, కండువా సహా హత్యకు వాడిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read : నకిలీ, నకిలీ.. మీకిచ్చేవన్నీ నకిలీనే.. ఆయన తీసుకునేవి మాత్రమే ఒరిజినల్. తప్పక తెలుసుకోవాల్సిందే

హత్యలకు ప్రేరేపించిన అర్షత్ తండ్రి బదర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. రైలు ద్వారా పరారీ అయినట్లు గుర్తించిన పోలీసులు.. సీసీ టీవీలు పరిశీలిస్తూ, దర్యాప్తును వేగవంతం చేశారు.

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×