BigTV English

Sircilla News : నకిలీ, నకిలీ.. మీకిచ్చేవన్నీ నకిలీనే.. ఆయన తీసుకునేవి మాత్రమే ఒరిజినల్. తప్పక తెలుసుకోవాల్సిందే

Sircilla News : నకిలీ, నకిలీ.. మీకిచ్చేవన్నీ నకిలీనే.. ఆయన తీసుకునేవి మాత్రమే ఒరిజినల్. తప్పక తెలుసుకోవాల్సిందే

Sircilla News : మీకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలా? ఎవరికైనా డెత్ సర్టిఫికేట్ అవసరమా ? ఏదైనా లోన్, మరేదైన అవసరానికి ప్రభుత్వ ఉద్యోగుల సంతకాలు తప్పనిసరినా.. అయితే మీకోసమే మా సేవలు అంటున్నాడు.. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఎలాంటి దృవపత్రాలు కావాలన్నా.. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగితే ఆలస్యం అవుతుంది.. తన దగ్గరకు వచ్చేయమంటున్నాడు. ఎవరికి ఎలాంటి దృవపత్రాలు కావాలన్నా తీసుకెళ్లమని చెబుతున్నాడు. మరి.. గ్రామ పంచాయితీ సెక్రటరీ, మండల అధికారులు సంతకాలు ఎలా అని అమాయకంగా అడగకండి.. సర్టిఫికేట్ తయారు చేసిన వాడిని, సంతకాలు పెట్టలేనా అంటూ.. ప్రభుత్వ అధికారుల సంతకాలు సైతం అతనే పెట్టేస్తున్నాడు. ఇలా.. లెక్కకు మిక్కిలి నకిలీ, ఫోర్జరీ సర్టిఫికేట్లు తయారు చేస్తూ, పోలీసుల చేతికి చిక్కాడో.. రిటైర్డ్ టీచర్.


నకిలీ, నకిలీ.. అంతా నకిలీ. అతను తీసుకునే డబ్బులు మాత్రమే ఒరిజినల్. ఆయనే.. సిరిసిల్ల పట్టణానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు సిరిపురం చంద్రమౌళి. ఈయన గారు ఆదాయం కోసం సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. ఎవరికి ఎలాంటి సర్టిఫికేట్లు కావాలన్నా సరే.. డబ్బులు కట్టి తీసుకెళ్లిపోవచ్చు. ఈ పనులన్నీ చేసేందుకు ఓ ఐదుగురితో ముఠాగా ఏర్పడి.. నకిలీ స్టాంపులను, ధ్రువపత్రాలు సృష్టిస్తున్నాడు. అంతేకాదు.. సంతకాలను ఫోర్జరీ చేస్తూ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారు.

రిటైర్డ్ టీచర్ చంద్రమౌళి సేవలు జిల్లాలోని అన్ని మండలాలకు చేరుతున్నాయి. ఇందుకోసం.. ఈ ముఠా అన్ని మండలాల ఎమ్మార్వోల పేర్లు, గ్రామపంచాయతీ సెక్రటరీ, సివిల్ సర్జన్లతో పాటు జిల్లాలోని ఇతర వీఐపీల పేర్లతో స్టాంపులు తయారు చేశారు. వాటితో ఎవరు వచ్చినా నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి.. వాటిపై అధికారికంగా కనిపించేలా స్టాంపు, సంతకాలు పెట్టేసి అమ్మేస్తున్నారు. సిరిసిల్లలో చాలా రోజులుగా వయస్సు నిర్థరణ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లతో పాటు చిట్ ఫండ్స్ లో అవసరమయ్యే ప్రభుత్వ ఉద్యోగుల సంతకాలతో కూడిన స్టాంపులు, సర్టిఫికెట్లను తయారు చేస్తూ డబ్బులు కూడబెడుతున్నారు. కాగా.. వీరి వ్యవహారాన్ని పోలీసులు బయటపెట్టారు.


ఇటీవల ఓ వ్యక్తికి సంబంధించి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్  నకిలీది సృష్టించగా.. అది నకిలీది అని తేలింది. దాంతో.. ఈ విషయంపై దృష్టి పెట్టిన పోలీసులు నకిలీ ధ్రువపత్రం ఎలా వచ్చిందని ఎంక్వైరీ చేయగా.. వీరి బాగోతం బయటపడింది. ఈ ముఠలాోని ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీరి నేరాలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.

Also Read : ఇది దగ్గు మందు కాదు.. ప్రమాదకర మత్తు పదార్థం. మీ దగ్గర దొరికిందా.. నేరుగా జైలుకే..

నకిలీ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి ప్రింటర్లు, నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇటువంటి సర్టిఫికెట్లతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో, వివిధ ప్రభుత్వ శాఖల్లో చేరిన వ్యక్తులను గుర్తిస్తామని వెల్లడించారు. నకిలీ సర్టిఫికేట్లు పెట్టి ఉద్యోగాలు పొందిన వారు సైతం నేరం చేసిన వారిగానే పరిగణిస్తామని ప్రకటించారు. వారిపై కూడా కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తామని తెలిపారు. కాబట్టి.. ఇలాంటి వ్యక్తుల నుంచి ఎలాంటి నకిలీ ధ్రువపత్రాలు, సంతకాలు పొందవద్దని జిల్లా ఎస్పీ అఖిల్ హెచ్చరించాడు.

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×