E-Paper
Advertisement

Maharashtra Police Crime: కన్నతండ్రిని చంపిన కూతురు.. మూడేళ్ల తర్వాత వెలుగులోకి.. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో అరెస్ట్!

Maharashtra Police Crime: కన్నతండ్రిని చంపిన కూతురు.. మూడేళ్ల తర్వాత వెలుగులోకి.. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో అరెస్ట్!
Advertisement

Maharashtra Police Crime: మనిషి చేసే తప్పులు ఎప్పటికైనా శిక్షగా మారి తిరిగి వస్తాయని, కాలం ఎంత గడిచినా చేసిన పాపం ఊరికే పోదని ఈ ఘటన మరోసారి నిరూపించింది. మూడు ఏళ్ల క్రితం ఒక సాధారణ మరణంగా ముగిసిపోయిన కేసు, ఇప్పుడు ఊహించని మలుపు తిరగడం మహారాష్ట్రలో సంచలనం సృష్టిస్తోంది. కన్న తండ్రినే కిరాతకంగా అంతమొందించిన ఒక పోలీస్ కుమార్తె ఉదంతం, చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరనే నిజాన్ని చాటిచెప్పింది.

2023 ఏప్రిల్ 25న మహారాష్ట్రకు చెందిన పోలీస్ అధికారి జయంత్ బల్లవార్ (45) విధులకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఆయన కుమార్తె ఆర్య, తండ్రికి ఎంతో ప్రేమతో మిల్క్‌షేక్ ఇచ్చింది. అది తాగిన కొద్దిసేపటికే ఆయన చంద్రపూర్‌లోని జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయి మరణించారు. అప్పట్లో దీనిని కేవలం అనారోగ్య కారణాలతో సంభవించిన సహజ మరణంగా భావించి, ఎటువంటి పోస్ట్‌మార్టం నిర్వహించకుండానే కేసును ముగించారు.

Advertisement

అయితే, ఈ మరణం వెనుక ఒక భయంకరమైన కుట్ర దాగి ఉందని మూడేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఆర్య బల్లవార్, ఆశిష్ షెడ్మేక్ అనే వ్యక్తితో 2022 నుండి ప్రేమలో ఉంది. వీరి బంధాన్ని తండ్రి జయంత్ తీవ్రంగా వ్యతిరేకించారు. తమ ప్రేమకు అడ్డుగా ఉన్న తండ్రిని తొలగించుకోవాలని ఆ జంట నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఆర్య తన బంధువు చైతన్య గెడమ్ సహాయంతో రూ. 5,000 ఇచ్చి విషాన్ని సేకరించింది. తండ్రి విధులకు వెళ్లే ముందు ఆ విషాన్ని మిల్క్‌షేక్‌లో కలిపి ఇచ్చి, ఆయన ప్రాణాలు తీసింది. తండ్రి మరణం తర్వాత ఆర్య, ఆశిష్ వివాహం చేసుకున్నారు.

పెళ్లయిన కొద్దికాలానికే వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. క్రమశిక్షణారాహిత్యం కారణంగా ఆశిష్ పోలీస్ శిక్షణ నుండి డిస్మిస్ అయ్యాడు. గొడవలు ముదరడంతో ఆర్య తన తల్లిగారి ఇంట్లోనే ఉండిపోయింది. గత వారం వీరి మధ్య జరిగిన గొడవ పతాక స్థాయికి చేరడంతో, ఆశిష్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భార్య చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. మూడెళ్ల క్రితం తన తండ్రికి ఆర్యనే విషం ఇచ్చి చంపిందని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఆర్య బల్లవార్, ఆమె భర్త ఆశిష్, విషం సరఫరా చేసిన బంధువుతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.

Advertisement

నిజం నిలకడ మీద తెలుస్తుందన్నట్లుగా, మూడు ఏళ్ల పాటు గుట్టుగా దాచిన ఈ హత్యోదంతం చివరకు నిందితుల మధ్య వచ్చిన గొడవల వల్లే బయటపడింది. ప్రస్తుతం ఈ నలుగురు నిందితులు పోలీసు కస్టడీలో ఉన్నారు. కన్న తండ్రిని, అది కూడా తోటి పోలీస్ అధికారిని చంపిన ఆర్య ఉదంతం మ‌హారాష్ట్ర‌ పోలీస్ శాఖను విస్మయానికి గురిచేసింది.

Read Also: Anantapur Crime News: భర్తను కిరాతకంగా చంపి.. ఇంటి ముందే పాతిపెట్టిన భార్య!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×