E-Paper
Advertisement

Vikarabad Explosion: వికారాబాద్‌లో పేలిన మెటల్ కంపెనీ.. ఎగిసిపడుతున్న మంటలు.. భయాందోళనలో స్థానికులు

Vikarabad Explosion: వికారాబాద్‌లో పేలిన మెటల్ కంపెనీ.. ఎగిసిపడుతున్న మంటలు.. భయాందోళనలో స్థానికులు
Advertisement

Vikarabad Explosion: భారీ అగ్నిప్రమాదం.. వికారాబాద్ జిల్లా లక్ష్మీదేవిపల్లి గ్రామ సమీపంలోని ఒక మెటల్ పరిశ్రమలో బుధవారం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా కంపించిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే పరిశ్రమలో మంటలు భారీగా ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. స్థానికులు భయాందోళనలకు గురై సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.

అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో పలువురు కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు తీవ్రతకు కొందరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మరియ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక యంత్రాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. అయితే కంపెనీలో ఉన్న రసాయనాలు లేదా గ్యాస్ సిలిండర్ల కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. పొగ కారణంగా సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.. షార్ట్ సర్క్యూట్ లేదా రియాక్టర్ పేలుడు సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

Also Read: కర్నూలు నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు మృతి

Advertisement

ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫ్యాక్టరీలో సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ విషాద ఘటనతో లక్ష్మీదేవిపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. పూర్తి వివరాలు అధికారుల అధికారిక ప్రకటన తర్వాత వెల్లడి కానున్నాయి.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×