E-Paper
Advertisement

Student Suicides: తీవ్ర విషాదం.. ఒకే రోజు వేర్వేరు కాలేజీల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలు..

Student Suicides: తీవ్ర విషాదం.. ఒకే రోజు వేర్వేరు కాలేజీల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలు..
Advertisement

Student Suicides: దారుణం.. పాపం ఒకే రోజు వేర్వేరు కాలేజీల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో తీవ్ర శోకంలో పిల్లలని కోల్పోయి శ్లోక సంద్రంలో మునిగిపోయారు తల్లిదండ్రులు..

బాచుపల్లిలో పెను విషాదం..
బాచుపల్లిలో పెను విషాదం చోటు చేసుకుంది. మక్తల్‌కు చెందిన వర్ష… బాచుపల్లిలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. మధ్యాహ్నం రెండు గంటల 50 నిమిషాల ప్రాంతంలో స్టడీ అవర్ నుండి హాస్టల్ రూమ్‌కి వెళ్లింది. వెళ్లగానే చున్నీతో ఉరేసుకుని చనిపోయింది. బ్రేక్ కోసం వెళ్లిన అమ్మాయి చాలాసేపు అయినా తిరిగి రాకపోవడంతో తోటి స్నేహితులు, కళాశాల స్టాఫ్ గదికి వెళ్లి చూడగా డోర్ లాక్ వేసి ఉంది. ఎంత పిలిచినప్పటికీ డోర్ ఓపెన్ చేయలేదు. దీంతో డోర్ పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది.

Advertisement

చైతన్య కాలేజీ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన..
వైద్యం కోసం కళాశాల సిబ్బంది గాంధీ హాస్పిటల్‌కు తరలించగా.. పరిశీలించిన డాక్టర్స్ అప్పటికే చనిపోయిందని నిర్థారించారు. హాస్టల్ సిబ్బంది సమాచారంతో బాచుపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు హాస్టల్ నిర్వాహకుల ఒత్తిడే కారణమంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.

ఓయూ ఆక్సిజెన్ పార్క్‌లో చెట్టుకు ఉరివేసుకొని విద్యార్ధి ఆత్మహత్య
ఉస్మానియా యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓయూలో ఇంజినీరింగ్‌ చదువుతున్న విజ్ఞాన్‌ అనే యువకుడు ఆక్సిజన్‌ పార్క్‌లో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతుడి స్వస్థలం హుజూరాబాద్‌గా గుర్తించారు. విజ్ఞాన్‌ మైనింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఓయూ హాస్టల్‌లో ఉంటున్నాడని అధికారులు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్మకు కారణాలు తెలియాల్సి ఉంది. వ్యక్తిగత కారణాలతో బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

నిజాంపేట ప్రగతి జూనియర్ కాలేజీకి చెందిన మరో విద్యార్థి ఆత్మహత్య..
నిజాంపేట ప్రగతి జూనియర్ కాలేజీలో మంజునాథ్ (18) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని పూర్తి సమాచారం ఇంకా తెలియ రాలేదు..

Also Read: సీఎం చంద్రబాబుకు ఉపశమనం.. లిక్కర్ కేసు మూసివేత!

అయితే ఈ ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యలతో తల్లిదండ్రులు పిల్లలని కోల్పోయి శ్లోక సంద్రంలో మునిగిపోయారు. మూడు డెడ్ బాడీలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అసలు విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాలేజిల్లో ఒత్తిడి కారణమా? లేదంటే మరో ఏదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×