E-Paper
Advertisement

Major Fire in Lodge: లాడ్జిలో భారీ అగ్ని ప్రమాదం.. స్పాట్‌లో 39 మంది, రాజంపేట పట్టణంలో ఘోరం

Major Fire in Lodge: లాడ్జిలో భారీ అగ్ని ప్రమాదం.. స్పాట్‌లో 39 మంది, రాజంపేట పట్టణంలో ఘోరం
Advertisement

Major Fire in Lodge: ఎండాకాలం రాకముందు భారీ అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదానికి కారణాలు ఏమైనా కావచ్చు. తాజాగా కడప జిల్లా రాజంపేటలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే‌స్టేషన్ రోడ్డు ఏరియాలోని దీప్ లాడ్జిలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనమయ్యారు. మరో 35 మందికి సురక్షితంగా బయటపడ్డారు.

రాజంపేట పట్టణంలోని ఓ లాడ్జిలో అగ్నిప్రమాదం

Advertisement

జరిగిన ఘటనలో అందులోని బస చేస్తున్నవారు హడలిపోయారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ఘటన జరిగిందని పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగాలో దీప్ లాడ్జిలో మంటలు చెలరేగాయి. తొలుత రూమ్‌లోకి పొగ వాసన రావడంతో అందులోని స్టే చేస్తున్నవారు అలర్ట్ అయ్యారు.

మెలిక వచ్చి చూసేసరికి దట్టమైన పొగలు వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో చాలామందికి ఊపిరాడలేదు. ప్రాణ భయంతో కొందరు పైఅంతస్తుకు… మరికొందరు కింద ఫ్లోర్‌కు పరుగులు తీశారు. ఈలోగా స్థానికులు గమనించి వెంటనే పోలీసులు, అగ్నిమాపక శాఖకు సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు.

Advertisement

ఒకరు సజీవ దహనం.. 38 మంది సేఫ్

కిటికీలు, డోర్లు పగలగొట్టి అందులోని వారిని కాపాడారు. ఎట్టకేలకు మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన సమయంలో పై అంతస్తులో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులు, ఫైర్ సిబ్బంది లోపల గదులను పరిశీలించారు.

అప్పటికే శ్రీనివాసులు అనే వ్యక్తి సజీవ దహనమయ్యారు. ఘటన సమయంలో లాడ్జిలో దాదాపు 39 మంది ఉన్నారని సమాచారం. పట్టణంలో కొత్తగా ప్రారంభమైన ఓ షాపు సిబ్బంది ఉన్నారని తెలిపారు. అందరూ సకాలంలో సహాయక చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్ పి మనోజ్ కుమార్ హెగ్డే స్వయంగా పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ALSO READ: రూ.590 కోట్ల బ్యాంకు డబ్బులు భార్య, బావమరిది ఖాతాల్లోకి

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×