E-Paper
Advertisement

Medchal Crime: పాత బకాయిల వ్యవహారం.. నడిరోడ్డుపై కత్తితో దాడి,  కీసరలో దారుణమైన ఘటన

Medchal Crime: పాత బకాయిల వ్యవహారం.. నడిరోడ్డుపై కత్తితో దాడి,  కీసరలో దారుణమైన ఘటన
Advertisement

Medchal Crime: క్రైమ్ అదే.. కానీ దాని రూపం మార్చుకుంది. ఏదైనా విభేదాలు తలెత్తితే ఒకప్పుడు కర్రలతో కొట్టుకునేవారు. ఇప్పుడు ఏకంగా కత్తులతో దాడి చేసుకున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన మేడ్చల్ జిల్లా కీసరలో వెలుగుచూసింది. కత్తితో ఓ వ్యక్తి.. మరొక వ్యక్తిపై దాడి చేశాడు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..

కీసరలో దారుణం.. పాత బకాయిల చిచ్చు

Advertisement

మేడ్చల్‌ జిల్లా కీసరలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పాత బకాయిల వ్యవహారంలో మిల్క్‌ డెయిరీ మేనేజర్‌ శ్రీనివాస్‌పై తల్వార్‌తో దాడి చేశాడు కిరణ్‌ అనే పాల వ్యాపారి. గురువారం వేకువజామున కీసర కూడలిలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

Advertisement

కొంతకాలంగా పాల వ్యాపారం చేస్తున్నాడు కిరణ్. ఈ క్రమంలో దొడ్ల మిల్క్ కంపెనీకి కొంత బకాయి పడ్డాడు. పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ముఖం చాటేస్తున్నాడు. దీనిపై కొద్దిరోజుల కింద మిల్క్ మేనేజన్ శ్రీనివాస్‌- కిరణ్‌ మధ్య గొడవలు జరిగాయి.

పాల మేనేజర్‌పై తల్వార్‌తో వ్యాపారి దాడి

ఈ నేపథ్యంలో గురువారం ఉదయం మిల్క్ మేనేజర్ శ్రీనివాస్ కీసరకు వచ్చాడు. కిరణ్‌కు పాలు వేయవద్దని డ్రైవర్‌కు చెప్పాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా చోటు చేసుకుంది. తీవ్ర ఆగ్రహానికి గురైన పాల వ్యాపారి కిరణ్, తల్వార్‌తో శ్రీనివాస్‌పై దాడి చేశాడు.

తన పగ తీరే వరకు తల్వార్ పదే పదే కొట్టాడు. అదే సమయంలో కిరణ్‌ని అడ్డుకోవాలని పలువురు ప్రయత్నించారు. వారిపై కూడా కిరణ్ కన్నెర్ర చేయడంతో దగ్గరకు వచ్చే సాహసం చేయలేదు. ఘటన తర్వాత అక్కడి నుంచి కిరణ్ పరారయ్యాడు. ఈలోగా పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి వచ్చేసరికి నిందితుడు పరారీలో ఉన్నాడు.  నిందితుడ్ని మౌలాలీకి చెందినవాడు.  దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

ALSO READ: బెంగుళూరులో టెక్కీ మృతిలో కొత్త కోణం..  ఘటన ముందు ఏం జరిగింది?

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×