Hijra Train Murder| గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా హిజ్రాలు హింసాత్మకంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. శుభాకార్యాల సమయంలో, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద హిజ్రాలు ఓ గ్యాంగ్‌గా ఏర్పడి, డబ్బులు డిమాండ్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ సంస్కృతి రైల్వేలో అత్యధికంగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఉత్తరాదిన వెళ్లే రైళ్లలో హిజ్రాలు హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నారు.
అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే, రైలు కోచుల్లో నగ్నంగా అసభ్య ప్రవర్తనతో (Indecent behavior) ప్రయాణికులను ఈ హిజ్రాలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే డబ్బులు ఇవ్వకపోతే ఒంటరిగా ఉన్న వారిపై దాడులు కూడా చేస్తారు. తాజాగా ఒక ఘటనలో రన్నింగ్ రైల్లో డబ్బులు ఇవ్వలేదని ఒక ప్రయాణికుడిని దారుణంగా కొట్టి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు, ప్రయాణికులు నిందితులకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లో ఘోర ఘటన: యువకుడిని చితకబాది హత్య చేసిన హిజ్రాలు
ఈ ఘటన రెండు వారాల క్రితం మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆదర్శ్ వర్మ గోండ్వాన ఎక్స్‌ప్రెస్‌లోకి ఎక్కిన హిజ్రాలు ప్రయాణికుల వద్ద డబ్బులు వసూలు చేస్తూ వీరంగం సృష్టించారు. ఈ క్రమంలో ఒక ప్రయాణికుడు తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో, ఆగ్రహించిన హిజ్రాల గ్యాంగ్ యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసింది.
కంపార్ట్మెంట్‌లో అందరూ చూస్తుండగా, యువకుడిని కిందపడేసి దారుణంగా తొక్కుతూ, తంతూ దాడి చేయడంతో అతను తీవ్ర గాయాలతో మరణించాడు. అనంతరం యువకుడిని రన్నింగ్ రైలు నుంచి కిందపడేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: భార్యను చంపి ముక్కలు చేశాడు.. ఆపై సూట్‌కేసులో ప్యాకింగ్, అత్తమామలకు ఫోన్
2018లో తమిళనాడులో ఘటన
ఆంధ్రప్రదేశ్ కు చెందిన కాలుం సత్యనారాయణ (32) అనే వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసి విజయవాడ నుంచి తిరుపూర్ కు బొకారో ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లో బయలుదేరారు. అయితే మార్గంలో తమిళనాడు కృష్ణగిరి జిల్లా వద్ద హిజ్రాలు ట్రైన్ లో వచ్చారు. గుంపు వచ్చిన హిజ్రాలు డబ్బులు ఇవ్వమని ప్రయాణికులను ఇబ్బుందులు పెట్టారు. అయితే సత్యనారాయణ స్నేహితులను అసభ్యంగా ప్రవర్తించడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. డబ్బులు ఇవ్వని వారికి పురుషత్వం లోపించాలని శాపాలు పెట్టడంతో గొడవ మొదలైంది. ఈ గొడవలో సత్యనారాయణను ట్రైన్ లో నుంచి హిజ్రాలు తోసేశారు. సత్యానారాయణను కాపాడేందుకు అతని స్నేహితుడు వీరబాబు కూడా ట్రైన్ నుంచి దూకేశాడు. అయితే సత్యనారాయణ చేయి రైలు చక్రాల కింద రావడంత నుజ్జు నుజ్జు అయింది. సత్యనారాయణ స్నేహితులు వెంటనే చైన్ లాగి ట్రైన్ ఆపేశారు.
కిందకు వెళ్లి చూడగా.. సత్యనారాయణకు గాయాలయ్యాయి. అతడిని తీసుకొని ఆస్పత్రికి వెళ్లగా.. అప్పటికీ సత్యనారాయణ మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. మరోవైపు వీరబాబు గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. పోలీసులు ఈ కేసులో విచారణ చేపట్టగా.. పరారైన హిజ్రాల ఆచూకీ ఇప్పటి వరకు తెలీలేదు.
ఒడిశాలో మరొక ఘోర ఘటన
ఇలాంటిదే మరొక ఘోర ఘటనలో, రైలు నుంచి ప్రయాణికుడిని తోసేసిన హిజ్రాలు అతడిని చంపేశారు. ఈ ఘటన ఒడిశాలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నౌపడ సమీపంలో 2015లో చోటు చేసుకుంది. తోటి ప్రయాణికుల కథనం ప్రకారం.. కేరళ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న వివేకానంద ఎక్స్‌ప్రెస్‌లో ఒడిశాలోని నయాగఢ్ జిల్లా చడమోల్ గ్రామానికి చెందిన పూర్ణచంద్ర సాహు, మరికొందరు వలస కార్మికులు భువనేశ్వర్‌కు వెళ్తున్నారు.
ఇదే రైలులో ప్రయాణిస్తున్న నలుగురు హిజ్రాలు డబ్బులు అడిగారు. వారు నిరాకరించడంతో గొడవ మొదలైంది. ఈ క్రమంలో హిజ్రాలు పూర్ణచంద్ర సాహు (45)ను నౌపడ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి తోసేశారు. ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపి, సాహును దగ్గరికి వెళ్లినప్పుడు అప్పటికే అతను మరణించి ఉన్నాడు. ఈ ఘటన జరిగిన వెంటనే హిజ్రాలు తప్పించుకుని పారిపోయారు.
ఈ వరుస ఘటనలు రైల్వే ప్రయాణికుల భద్రతపై తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి. రైలు ప్రయాణంలో భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, రైల్వే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. హిజ్రాలు ఇలా ధైర్యంగా దాడులు చేసే ఘటనలు రైల్వే పోలీసుల భద్రతా వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతున్నాయి.
भोपाल से विदिशा के बीच गंज बासौदा स्टेशन के पास होली के दिन चलती ट्रेन में एक वारदात ने दिल को दहला दिया, 12409 गोंडवाना एक्सप्रेस ट्रेन में किन्नरों ने एक युवक की पीट पीटकर जान ले ली और ट्रेन से बाहर फेंक दिया। @RailMinIndia @RailwaySeva @AshwiniVaishnaw #railway @DrMohanYadav51 pic.twitter.com/EhpfcrzF1O
— Anil Kushwaha (@AnilKus61372462) March 21, 2025