Hyderabad Crime News: ప్రస్తుతం సమాజంలో మానవత్వానికి విలువ లేకుండా పోయింది. చిన్న చిన్న గొడవలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆస్తి తగాదాల కారణంగా సొంత అన్నదమ్ములే ఒకరిని ఒకరు దారుణంగా చంపుకుంటున్నారు. ఆవేశంలో ఓపికను కోల్పోయి ప్రాణాలనే తీసుకుంటున్నారు. కొందరు అయితే సొంత కన్న పిల్లలనే చంపుకుంటున్నారు. అసలు ఈ సమాజం ఎటుపోతుంది..? చిన్న చిన్న కారణాలకే తాము మనుషులం అనే విషయాన్ని మరిచిపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు.
క్షణాకావేశంలో తీసుకునే నిర్ణయాలు వల్ల జీవితాలే నాశనం అవుతున్నాయి. ఇలాంటి ఘటనలు ప్రస్తుత సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్న చిన్న గొడవలకే మానవత్వం మరిచిపోయి స్నేహతులను, పిల్లలను, అన్నదమ్ములను చంపుకుంటున్నారు. తాజాగా.. హైదరాబాద్ నాగోల్ పరిధిలో దారుణం ఘటన జరిగింది. చేపల కూర ఓ యువకుడి ప్రాణాన్ని తీసింది. అతడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీసులు వివరాల ప్రకారం, హైదరబాద్ లోని నాగోల్ మత్తుగూడ సమీపంలోని కుత్బుల్లాపూర్‌కు చెందిన వెంకటేశ్ యాదవ్ అనే వ్యక్తి గత కొన్ని రోజుల నుంచి వాటర్ ప్లాంట్‌ను నడుపుతున్నాడు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దేవీరామ్ అనే యువకుడు కొన్ని ఏళ్ల నుంచి వెంకటేశ్ యాదవ్ దగ్గర పనిచేస్తున్నాడు. 2 నెలల క్రితం దేవీరామ్ తన సొంత ఊరుకు చెందిన ముఖేశ్ కుమార్, యోగేశ్ కుమార్ లను కూడా హైదరాబాద్ కు తీసుకువచ్చాడు. తను పని చేస్తున్న వాటర్ ఫ్లాంట్ లోనే వారికి పనిలో పెట్టాడు. వాటర్ ఫ్లాంట్ వద్ద ఓ రూం ఉంది. ఆ రూంలోనే ముగ్గురు యువకులు ఉంటున్నారు.
అయితే ఈ నెల 21న రాత్రి ముగ్గురు కలిసి మద్యం తాగి రూంలోకి వెళ్లారు. ఇద్దరి కన్నా ముందుగా వచ్చిన దేవీరామ్ చేపల కూర వంట చేశాడు. అయితే చేపల కూర దేవీరామ్ తినేసి మిగిలిన కూర కాలనీలో ఉన్న కుక్కలకు వేశాడు. రూంలోకి ఫుల్ గా తాగేసి వచ్చిన ముఖేశ్, యోగేశ్ చేపల కూర ఏమైందని దేవీరామ్ ను నిలదీశారు. వారి ప్రశ్నకు దేవీరామ్ అహంకారంతో మాట్లాడాడు. ఈ వివాదం ముదిరి చివరకు గొడవకు దారి తీసింది. విచక్షణ కోల్పోయిన ముఖేశ్ కుమార్ తాగిన మైకంలో కూరగాయలు ఈల పీటతో దేవీరామ్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. గాయాలతో రోడ్డుపై కుప్పకూలిన దేవీరామ్ ను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దేవీరామ్ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా, ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. చేపల కూర కోసం హత్య చేయడం ఏంటి అని సోషల్ మీడియాలో పలువురు కామెంట్ చేస్తున్నారు.
Also Read: NLC Recruitment: డిగ్రీతో ఎన్‌ఎల్‌సీ నుంచి భారీ నోటిఫికేషన్.. ఈ జాబ్ వస్తే రూ.1,00,000 పైగా జీతం..
Also Read: UOH Recruitment: హైదరాబాద్‌లో జాబ్ చేసే అవకాశం.. ఈ అర్హతలు ఉండాలి.. ఇంకా 5 రోజులే మిత్రమా..