BigTV English

Man Kills Mother: దారుణం.. ఐరన్ రాడ్డుతో కొట్టి తల్లిని క్రూరంగా చంపిన కొడుకు..!

Man Kills Mother: దారుణం.. ఐరన్ రాడ్డుతో కొట్టి తల్లిని క్రూరంగా చంపిన కొడుకు..!

Man Killed His Mother in Andhra Pradesh: నవమాసాలు మోసి.. కని పెంచిన తల్లిదండ్రులను చిన్న చిన్న కారణాలకే పొట్టనపెట్టుకుంటున్నారు కొడుకులు. తాగేందుకు డబ్బివ్వలేదని, ఆస్తి పంపకాలు చేయలేదని, ఇంట్లో గొడవలు.. ఇలా రకరకాల కారణాలతో చంపేస్తున్నారు. తాజాగా కుటుంబ కలహాల కారణంగా ఓ కొడుకు.. తల్లిని ఐరన్ రాడ్డుతో కొట్టి చంపాడు. ఈ ఘటన అనంతపురంలోని కంబదూరులో జరిగింది. వడ్డి వెంకటేష్ అనే వ్యక్తి వడ్డి సుంకమ్మ (45)ను ఇనుపరాడ్ తో కొట్టి హతమార్చాడు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుంకమ్మ తన భర్తతో గొడవ పడింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తల్లిదండ్రుల గొడవతో విసిగిపోయిన వెంకటేష్ కోపంతో.. ఇనుపరాడ్ తీసుకుని సుంకమ్మ తలపై బలంగా కొట్టాడు. సుంకమ్మకు తీవ్రగాయాలై.. అక్కడికక్కకడే మృతి చెందింది. అనంతరం వెంకటేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు.

Also Read: పల్నాడులో ఘోరం, ట్రావెల్ బస్సు ఢీకొట్టిన టిప్పర్, ఐదుగురు సజీవ దహనం


సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించి.. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న వెంకటేశ్ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. గతేడాది జూన్ లో.. రాజేష్ (37) అనే వ్యక్తి తన అత్తను నరికి చంపాడు. తన భార్యను విడాకులకు ప్రోత్సహించిన కారణంగా.. విజయవాడలోని చనుమోలు వెంకట్రావు ఫ్లై ఓవర్ పై అత్తను నరికి చంపాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.

Tags

Related News

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. వ్యాన్- కంటైనర్ ఢీ.. స్పాట్‌‌లో 10 మంది మృతి, ఇంకా

Delhi crime news: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. స్విమ్మింగ్ పూల్ వెళ్లిన బాలికలపై అత్యాచారం!

Loan app scam: రూపాయి లోన్ లేదు కానీ.. రూ.15 లక్షలు చెల్లించిన యువతి.. షాకింగ్ స్టోరీ!

Karnataka Crime: దారుణం.. అత్తను 19 ముక్కలుగా నరికి 19 చోట్ల పడేసిన అల్లుడు

Kerala Crime: గదిలో లాక్ చేసి.. మతం మారాలంటూ ప్రియురాలిని వేధించిన ప్రియుడు.. ప్రాణాలు విడిచిన యువతి

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Big Stories

×