CM Jagan Went to I-PAC Office: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి. నాయకుల వాయిస్ కూడా సైలెంట్ అయ్యింది. కానీ ఆపధర్మ ప్రభుత్వం.. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కంటిన్యూ అవుతోంది. దాదాపు రెండు వారాలకు పైగానే వ్యవహారాలను చూసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికలకు ముందు పథకాల నిధుల విషయంలో నానాయాగీ చేసింది వైసీపీ ప్రభుత్వం. పోలింగ్ మరుసటి రోజు ప్రజల అకౌంట్లలోకి వేయాలని సలహా ఇచ్చింది. న్యాయస్థానం కూడా అదే విధమైన తీర్పు ఇచ్చింది.
ఎన్నికలు అయిపోయాయి.. ఈ విషయంలో జగన్ సర్కార్ సైలెంట్ అయిపోయింది. ప్రభుత్వ పెద్దలు నోరు మెదపడం లేదు. ప్రజలు మాత్రం తమ అకౌంట్లలో నిధులు ఎప్పుడు పడతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎందుకు సైలెంట్ అయ్యిందని చర్చించుకోవడం సగటు ఏపీ ప్రజల వంతైంది. అధికారంలోకి రాలేమని భావిస్తుందా? అన్న ప్రశ్న మొదలైంది.
ఎన్నికల ముందు సభల్లో పథకాలకు సంబంధించి పలుమార్లు బటన్ నొక్కేశారు సీఎం జగన్. అవన్నీ ఉత్తిత్తి బటన్ అని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లకు ఆ విషయం నిజమైంది. ఇకపోతే.. అసలు విషయానికొద్దాం. ఎన్నికల ఫలితాలు తమకే ఎడ్జ్ ఉంటుందని అధికార పార్టీ నేతలు బయటకు చెబుతున్నా, లోలోపల మాత్రం టెన్షన్ వెంటాడుతోంది.
Also Read: Visakhapatnam: విశాఖలో దారుణం.. టీడీపీకి ఓటేశారని విచక్షణారహితంగా దాడి..
వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించింది ఐ-ప్యాక్ సంస్థ. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడలో ఆ సంస్థ తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది. అక్కడి నుంచే ఏపీలో అధికార వైసీపీ తరపున సోషల్‌మీడియా పనులు చక్కబెట్టింది. తాజాగా ఎన్నికలు ముగిసిన తర్వాత ఐ-ప్యాక్ సంస్థ విజయవాడ నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలీదు. కాకపోతే ఆ తరహా వార్తలు జోరందుకున్నాయి.
విజయవాడ బెంజి సర్కిల్‌లో ఉన్న ఐ-ప్యాక్ కార్యాలయానికి గురువారం మధ్యాహ్నం సీఎం జగన్ వెళ్లారు. గంటపైగానే అక్కడి ప్రతినిధులతో మాట్లాడారు. వాళ్లతో సెల్ఫీలు కూడా దిగారు. ఎన్నికల పోలింగ్, గెలుపు అవకాశాలు వంటి విషయాలపై ఆరా తీశారు. పార్టీ తరపున పని చేసేందుకు కృతజ్ఞతలు చెప్పడంతోపాటు వారికి బహుమతులు అందజేశారు.
Also Read: EC Serious: ఏపీ అల్లర్లపై ఈసీ సీరియస్.. ఇద్దరు ఎస్పీలు సస్పెండ్..
గతంలో గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా ఐ-ప్యాక్ ఆఫీసును సందర్శించలేదు జగన్. ఇప్పుడు వెళ్లడంతో ఆ సంస్థ నిజంగానే విజయవాడ నుంచి వెళ్లిపోతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. రేపో మాపో ఐ-ప్యాక్ సంస్థ గురించి క్లారిటీ రావడం ఖాయమని అంటున్నారు.