BigTV English

NTR Donation to Temple: ఏపీలోని ఆలయానికి ఎన్టీఆర్ భారీ విరాళం.. వీడియో వైరల్

NTR Donation to Temple: ఏపీలోని ఆలయానికి ఎన్టీఆర్ భారీ విరాళం.. వీడియో వైరల్

Jr. NTR Donation to Andhra Pradesh Temple: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీపై ప్రేక్షకాభిమానులు భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ మరో అప్డేట్‌ను అందించిన విషయం తెలిసిందే.


ఇందులో బాగంగా ఈ నెల 20 ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ను మే 19న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ ఫస్ట్ సింగి‌ల్ కోసం యావత్ సినీ ప్రియులు, అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ మూవీని దర్శకుడు కొరటాల శివ ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం రెండు పార్టులుగా తెరెక్కుతోంది.

అలాగే మరొక సినిమా బాలీవుడ్‌లో చేస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ‘వార్2’లో నటిస్తున్నాడు. ఇందులో హృతిక్ రోషన్ మెయిన్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా శర వేగంగా జరుగుతోంది. ఇందుకోసం ఎన్టీఆర్ ముంబైలో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.


Also Read: పోస్టరే ఇంత వైలెంట్ గా ఉంటే సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో.. రెడీ అవ్వండ్రా అబ్బాయిలు

ఇదిలా ఉంటే మే 20న ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా తన గొప్ప మనసును చాటుకున్నాడు తారక్. ఇందులో భాగంగా ఏపీలోని ఓ ఆలయానికి భారీగా విరాళం అందించాడు. కోనసీమ జిల్లా చెయ్యేరులోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయానికి తారక్ దాదాపు రూ.12.5 లక్షల భారీ విరాళం అందించారు. ఈ మేరకు తమ కుటుంబ సభ్యుల పేర్లతో ఆ ఆలయ నిర్మాణానికి విరాళం అందించారు.

Also Read: JR NTR : ల్యాండ్ వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్

అయితే ఈ విషయాన్ని ఎన్టీఆర్ కానీ, ఆయన టీం కానీ ఎక్కడా వెల్లడించలేదు. కానీ ఆ ఆలయానికి సమీపంలో ఉన్న కొందరు ఆన్‌లైన్‌లో ఫొటోలు షేర్ చేయడంలో ఈ విషయం బయటకి వచ్చింది. అంతేకాకుండా ఆయన విరాళం అందించినట్లు ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కొందరు ఫొటోలు తీసి షేర్ చేశారు. అయితే ఎన్టీఆర్ విరాళాలు అందించడం, సేవా కార్యక్రమాలు చేయడం ఇదేమి మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడా చాలానే చేశారు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×