BigTV English

AP Politics: ఆ నేతలంతా జంప్? విజయనగరం వైసీపీలో ఏం జరుగుతుంది

AP Politics: ఆ నేతలంతా జంప్? విజయనగరం వైసీపీలో ఏం జరుగుతుంది

AP Politics: ఉన్నారులే అనుకుంటే ఉండరు. లేరనుకుంటే.. ఉంటారు. కన్ఫ్యూజింగ్‌గా ఉందా? అలాగే ఉంటుంది. ఎందుకంటే.. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీలో పరిస్థితి అలాంటిది మరి. ఆ జిల్లాలో వైసీపీ నేతలు ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా ఉన్నారట. అంతా.. గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఎటు చాన్స్ ఉంటే అటు పోదామనే ఆలోచనతో ఉన్నారట. అసలు.. ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు?


2019లో విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్

విజయనగరం జిల్లాలో వైసీపీ నేతల తీరు ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఏదో పార్టీలో ఉన్నామా అంటే.. ఉన్నామన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. 2019లో.. జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ.. మొన్నటి ఎన్నికల్లో మాత్రం పూర్తిగా చతికిలపడింది. సీన్ రివర్స్ అవడంతో.. వైసీపీ నేతలంతా ఆలోచనలో పడ్డారట. ముఖ్యంగా.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఉమ్మడి జిల్లాపరంగా జరిగిన పొరపాట్లను కూడా ఇటీవల నెమరేసుకుంటున్నట్లు భోగట్టా. అప్పట్లో.. అశోక్ గజపతిరాజు లాంటి సీనియర్ నేతలను కూడా వైసీపీ వేధించి అవమానించిందనే చర్చ ఉంది. దీని వెనుక కొందరు జిల్లా వైసీపీ నేతల పాత్ర కూడా ఉందనేది బహిరంగ రహస్యమే. అయితే.. రాజకీయాల్లో మకుటం లేని మహరాజులకే అవమానాలు తప్పనప్పుడు.. మనమెంత, మన అనుభవమెంత అనే ఆలోచనతో ఉన్నారట వైసీపీ నేతలు. రాష్ట్రంలోను ప్రస్తుత పరిణామాలు అలానే ఉన్నాయనే విషయం వైసీపీ నేతలకు బాగా అర్థమైంది. మిథున్ రెడ్డి, చెవిరెడ్డి లాంటి కీలక నేతలనే అరెస్ట్ చేసినప్పుడు.. తమ పరిస్థితేంటి? అనే లెక్కలు వేసుకుంటున్నారట వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు. అందుకోసమే.. నియోజకవర్గాల్లో వారంతా పెద్దగా కనిపించడం లేదనే వాదనలున్నాయ్.


దేనికి పెద్దగా స్పందించని జిల్లా వైసీపీ నేతలు

రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలను విమర్శించడం రాజకీయాల్లో సహజం. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. జిల్లాలో ఒకరిద్దరు వైసీపీ నేతలు తప్ప.. మిగతా వారెవరూ దేనికీ పెద్దగా స్పందించడం లేదు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత.. ఏ ఎమ్మెల్యే కూడా పెద్దగా ప్రెస్ మీట్లు పెట్టలేదనే చర్చ పార్టీలో ఉంది. కొందరు పెట్టినా.. బలవంతంగానే పెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. కూటమి పార్టీలను విమర్శించేందుకు.. వైసీపీ నేతలంతా కాస్త వెనుకా ముందు అవుతున్నారనే చర్చ జరుగుతోంది. వైసీపీ నేతలు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులను చూసి.. జిల్లా ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు.

జిల్లాలో తూతూ మంత్రంగానే వైసీపీ కార్యక్రమాలు

వైసీపీ అధినాయకత్వం సూచనల మేరకు.. బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని కూడా తూతూ మంత్రంగానే కానిచ్చేస్తున్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు. ఏదో.. వెళ్లామా? వచ్చామా? అన్నట్లుగా ఉంటున్నారు. కూటమి ప్రభుత్వ పథకాల అమలులో లోటుపాట్లు, పొరపాట్లపై ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. ప్రశ్నించడం లేదు. మొన్నటికి మొన్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ జరిగిన తీరు.. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ.. జిల్లాలో ఏ ఒక్క నేత కూడా నోరు మెదపలేదు.

Also Read: ఇజ్రాయెల్, ఖతార్ వార్..! బెడిసికొట్టిన ట్రంప్ డబుల్ గేమ్

గతంలో.. నేరుగా చంద్రబాబునే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించిన కొందరు నేతలు.. ఇప్పుడు అవన్నీ తమ అధినేత జగన్ చూసుకుంటారులే అన్నట్లుగా.. స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఇంకొందరు నేతలైతే.. పార్టీ ఆఫీసుల వైపు రావడమే మానేశారట. ముఖ్యంగా.. వచ్చే ఎన్నికల నాటికి.. నియోజకవర్గాల పునర్విభజన జరిగి.. రిజర్వేషన్లు మారితే పరిస్థితేంటనే ఆలోచనలోనూ పడ్డారట. అందుకే.. కాస్త ఆచితూచి వ్యవహరిద్దామనేది.. వైసీపీలో చాలా మంది నాయకులు అనుకుంటున్నారనే చర్చ.. జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

Story By Anup, Bigtv

Related News

YS Jagan: మావాళ్లు ఇంకా గేర్ మార్చలేదు.. బాధపడుతున్న జగన్

Pawan Kalyan: రాయలసీమ అభివృద్ధిపై.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: సీఎం చంద్రబాబు సూపర్ న్యూస్.. వారికి దసరా రోజున అకౌంట్లలోకి రూ.15వేలు

Jagan: మళ్లీ దొరికిపోయిన జగన్.. అప్పుడలా, ఇప్పుడిలా అంటూ నిజాలు బయటపెట్టిన టీడీపీ

AP Dasara Holidays 2025: విద్యార్ధులకు అలర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు

Big Stories

×