Brahmamudi serial today Episode: సొంత భార్య నగలు దొంగిలించే స్థితికి నీ కొడుకు దిగజారిపోయాడు అంటూ స్వప్న కోపంగా రుద్రాణిని నిలదీస్తుంది. అయితే ఇంతలో అపర్ణ మెల్లగా ఇంద్రాదేవితో ఈ గొడవ ఎలాగైనా మీరే ఆపండి లేకపోతే గొడవ పెద్దగా అయితే రాజ్, కావ్యల పెళ్లి జరగకుండా అయిపోతుంది అని చెప్తుంది.
దీంతో ఇంద్రాదేవి కల్పించుకుని అమ్మా స్వప్న రాహుల్ నిజంగానే తప్పు చేశాడు ఒప్పుకుంటున్నాను. అలాగని గొడవ చేసి ప్రయోజనం ఏముంటుంది అమ్మా అంటుంది. దీంతో స్వప్న మీరు కూడా అలా మాట్లాడుతున్నారేంటి అమ్మమ్మ తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి కదా అంటుంది. దీంతో ఇంద్రాదేవి అవును శిక్ష పడాలి. ఏ శిక్ష వేయాలో భార్యగా నువ్వే డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఈ విషయాన్ని నలుగురిలో పెట్టి ఇంటి పరువు తీసుకోవడం వల్ల నష్టమే తప్పా మీ సమస్యకు పరిష్కారం ఎలా అవుతుంది. వాడి తప్పు వాడు తెలుసుకుని తిరిగి సరైన దారిలో నడిచేలా నువ్వు చేయ్.. దానికి రుద్రాణి అడ్డుపడినా మేము ఒప్పుకోము సరేనా అని చెప్పగానే..
అపర్ణ నగలు తీసి స్వప్నకు ఇస్తుంది. అమ్మా స్వప్న ఇలా ఆవేశంతో కాకుండా ఏం చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకో ఈ నగలు లోపల పెట్టు అని పంపిచేస్తుంది. రాహుల్ మాత్రం ఇవి గిల్టీ నగలు అని ఎవ్వరూ గుర్తు పట్టలేదు అని మనసులో అనుకుంటాడు. తర్వాత బయట రాహుల్‌ను రుద్రాణి కోపంగా కొడుతుంది. కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెట్టినట్టు అయిందిరా నా పరిస్థితి నిన్ను రాజును చేయాలనుకున్న ప్రతిసారి నువ్వు బంటుగానే మిగిలిపోతున్నావు. అంటూ తిడుతుంది. ఒక్కసారి నేను చెప్పేది విను మమ్మీ అంటూ రాహుల్ అడిగినా రుద్రాణి ఆగదు. పెళ్లాం నగలు కొట్టేయాలన్న దరిద్రపు గొట్టు ఆలోచన ఎలా వచ్చిందిరా నీకు ఇక ఆ స్వప్న నిన్ను పెంపుడు కుక్కలాగా ఆడిస్తుంది అంటూ బాధపడుతుంది. దీంతో రాహుల్ దానికి అంత సీన్ లేదు మమ్మీ అయినా అది చెప్పినట్టు నేను ఎందుకు వింటాను అంటాడు రాహుల్.
మరోవైపు కారులో వెళ్తున్న రాజ్, కావ్య టీ తాగడానికి ఒక దగ్గర ఆగుతారు. ఇంతలో అక్కడికి యామిని పంపించిన రౌడీలు వస్తారు. కావ్యను వల్గర్‌గా కామెంట్ చేస్తారు. రౌడీలు ఎంత రెచ్చగొట్టినా కావ్య కామ్‌గా ఉంటుంది. కోప్పడుతున్న రాజ్‌ను బలవంతంగా అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతుంది. రౌడీలు వెంటనే రాజ్ కారును ఫాలో చేస్తుంటారు. రాజ్ కోపంగా అసలు వాళ్లను చూసి మనం ఎందుకండి పారిపోవాలి. ఒకసారి కారు ఆపి వాళ్లకు బుద్ది చెబితే ఐపోతుంది కదా..? అంటాడు. దీంతో కావ్య మీకు దండం పెడతాను. నాకు గొడవలు అంటే భయం. ముందు కారు స్పీడుగా పోనియండి అని చెప్తుంది. కొద్దిదూరం వెళ్లాక రాజ్ కారు ఆగిపోతుంది. ఏమైంది అని కావ్య అడుగుతుంది. ఒక్క నిమిషం అని రాజ్ కారు దిగి చెక్ చేయబోతుంటే.. వెనక నుంచి రౌడీలు రావడం చూసిన కావ్య ఏవండి వాళ్లు వచ్చేస్తున్నారు రండి అక్కడకు వెళ్దాం అంటూ పక్కనే ఉన్న ఫారెస్ట్ లోకి వెళ్లిపోతారు.
రౌడీలు కావ్య వాళ్లను ఫాలో చేస్తుంటారు. కొద్దిదూరం వెళ్లాక నడవలేక అలిసిపోతుంది. ఇంక నా వల్ల కాదండి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను అని కావ్య చెప్పగానే.. రాజ్ నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. ఇలా పరిగెత్తడం కంటే వాళ్లను కొట్టడమే ఈజీ అని మీరే వినిపించుకోకుండా పారిపోదాం అంటూ ఇక్కడి దాకా తీసుకొచ్చారు అని రాజ్ చెప్పగానే.. అంటే తప్పు నాది అంటారా..? అని కావ్య అడుగుతుంది. దీంతో రాజ్ పారిపోవడం తప్పు అంటున్నానండి అయినా మనమేం తప్పు చేశామని వాళ్లను చూసి పారిపోవాలి అంటాడు రాజ్. దీంతో మీరు ఒక్కరు ఉన్నారు అంత మందిని ఎలా హ్యాండిల్ చేస్తారు అంటుంది కావ్య. ఏంటండి నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా అని అడుగుతాడు రాజ్. దీంతో కావ్య మీరు నార్మల్ గా ఉంటే నమ్మేదాన్ని కానీ మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో వారితో గొడవ పడటం ప్రమాదం అందుకే అంటుంది. దీంతో రాజ్ నాకేం అయింది అని అడుగుతాడు.
దీంతో ఏమైందని అడుగుతారేంటి..? యాక్సిడెంట్.. లోయ.. అంటూ చెప్పబోయి ఆపేస్తుంది. వెంటనే అదే మీరు కోమాలోకి వెళ్లి గతం అంతా మర్చిపోయారు కదా అని చెప్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి అని రాజ్ అడగ్గానే.. మన వాళ్లకు ఫోన్ చేసి హెల్ప్ అడుగుదాం అని అపర్ణకు కాల్ చేస్తుంది కావ్య. సిగ్నల్ సరిగ్గా లేకపోవడంతో కాల్ కట్ అవుతుంది. ఇంతలో రౌడీలు రావడంతో కావ్య, రాజ్ అక్కడి నుంచి పారిపోతారు. తర్వాత అపర్ణ, కావ్యకు ఫోన్ చేస్తుంది. కావ్య జరిగిన విషయం చెప్తుంది. అడవిలో ఉన్నామని మేము ఎక్కడ ఉన్నామో తెలియదని చెప్తుంది. వెంటనే అప్పుకు చెప్పండి మాకు హెల్ప్ చేస్తుంది అని చెప్పగానే సరే అంటూ అపర్ణ అప్పు దగ్గరకు వెళ్తుంది. జరిగిన విషయం అప్పు కు చెప్పగానే అప్పు షాక్ అవుతుంది. వెంటనే నేను వెళ్లి వాళ్లను సేప్‌గా తీసుకొస్తాను మీరు కంగారు పడొద్దు అని అప్పు వెళ్లిపోతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?