Rajasthan Fire: రాజస్థాన్ రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఖైర్తల్–తిజారా జిల్లాలోని భివాడి ప్రాంతంలోని ఖుష్ఖేరా కరౌలి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు సజీవదహనమయ్యారు. ఫ్యాక్టరీలో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు ప్రాథమిక సమాచారం సూచిస్తోంది. ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. మరో కొందరు కార్మికులు ఫ్యాక్టరీలోనే చిక్కుకుపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు పేర్కొన్నారు.
అగ్నిప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. సుమారు గంటన్నర పాటు నిరంతరాయంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో లక్షల రూపాయల విలువైన యంత్రాలు, వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. గాయపడిన కార్మికులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం ఎంతమంది కార్మికులు ఉన్నారనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కూడా ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read: హాలీవుడ్ రేంజ్‌లో గాలి సుడులు.. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు!
రాజస్థాన్‌లో అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం
భివాడీలోని కురుక్షేత్ర-కరోలి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు కార్మికులు సజీవదహనం
మరో ఇద్దరు కార్మికులు ఫ్యాక్టరీలోనే చిక్కుకున్నట్లు సమాచారం
ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది
Seven… pic.twitter.com/6KyB1u8yw7
— BIG TV Breaking News (@bigtvtelugu) February 16, 2026