Kurnool News: కర్నూలులో దారుణ విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని దేవనకొండలో ఓ కిరాతక తండ్రి 8 నెలల చిన్నారిని దారుణంగా చంపాడు. భార్యపై అనుమానంతో ఎనిమిది నెలల పసి పాపను తండ్రి నరేష్ నీటి డ్రమ్ములో ముంచి కిరాతకంగా హత్య చేశాడు. అంతే కాకుండా అడ్డు వచ్చిన భార్య శ్రావణిని తీవ్రంగా కొట్టేందుకు ప్రయత్నంచాడు. భర్త నరేష్ దాడిలో శ్రావణికి తీవ్ర గాయాలు అయ్యాయి. కొన ఊపిరితో ఆమె ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం శ్రావణి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
నరేష్ గతంలో కూడా నేరాలకు పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. తన మొదటి భార్యను చంపేసి జైలుకు వెళ్లి వచ్చినట్టు తెలిపారు. జైలు నుంచి విడుదల అయ్యాక మర్డర్ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. నరేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అనుమానంతోనే పసి పాపను చంపి.. భార్యను కూడా చంపబోయాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
ALSO READ: Constable Jobs: పదితో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. 81,000 జీతం.. డోంట్ మిస్