E-Paper
Advertisement

Falaknuma Fire: ఫలక్‌నుమా ఫర్నీచర్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం.. కోట్ల ఆస్తి బుగ్గి

Falaknuma Fire: ఫలక్‌నుమా ఫర్నీచర్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం.. కోట్ల ఆస్తి బుగ్గి
Advertisement

Falaknuma Fire: హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫలక్‌నుమా ఫ్యాలెస్ సమీపంలోని ఒక ఫర్నీచర్ షాప్‌ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దుకాణంలో కలప, కుషన్లు, ఇతర మండే స్వభావం గల వస్తువులు భారీగా ఉండటంతో మంటలు క్షణాల్లోనే భవనం మెుత్తానికి వ్యాపించాయి. ఆకాశంలోకి దట్టమైన పొగలు అలుముకోవడంతో చుట్టుపక్కల ప్రజలు భాయాందోళనలకు గురయ్యారు.

ఈ ప్రమాదంలో అత్యంత ఆందోళన కలిగించిన విషయం ఏమిటంటే.. మంటలు వ్యాపించిన షాపు వెనుక ఇండియన్ గ్యాస్ గోదాం ఉండటం. ఒకవేళ మంటలు గోదాం వరకు చేరుకుంటే పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని గ్రహించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి.. రాకపోకలు నిలిపివేశారు.

Advertisement

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఐదుకు పైగా ఫైర ఇంజన్లతో రంగంలోకి దిగారు. గ్యాస్ గోదాం వైపు మంటలు వెళ్లకుండా సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగనప్పటికీ.. కోట్ల రూపాయల విలువైన ఫర్నీచర్ కాలి బూడిదైనట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు చేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుననారు.

Also Read: మాజీ భార్య అక్క తిట్టిందని.. వాటర్ ట్యాంక్‌ ఎక్కిన 4 పెళ్లిళ్ల మొగుడు

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×