E-Paper
Advertisement

Women Suicide Attempt: నంద్యాలలో వన్ టౌన్ సీఐ పచ్చి బూతులు.. మహిళ ఆత్మహత్యాయత్నం

Women Suicide Attempt:  నంద్యాలలో వన్ టౌన్ సీఐ పచ్చి బూతులు.. మహిళ ఆత్మహత్యాయత్నం
Advertisement

నంద్యాలలో ఓ మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. సెల్ఫీ వీడియో తీసి తమ బాధను వివరించిన ఆమె.. తన భర్త షమీమ్‌ను ఓ కేసులో బయటకు తీసుకొస్తానని హుస్సేన్ అనే వ్యక్తి రూ.5 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆరోపించింది. హుస్సేన్‌కు పోలీసులు సహకరిస్తున్నారని.. తమ ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో.. సీఐని ఆశ్రయించగానే తనపై దుర్భాషలాడారని బాధితురాలు వీడియోలో తెలిపింది.

ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ ఆవేశంలో ఫినాయిల్ తాగడంతో కుటుంబ సభ్యులు వెంటనే నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుండగా, ఆరోగ్య పరిస్థితి క్షీణంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ సంఘటనపై బాధిత మహిళ కుటుంబ సభ్యులు స్పందించారు. తమపై జరుగుతున్న అన్యాయాన్ని అధికారులు గమనించి న్యాయం చేయడంతో పాటు సీఐపై తగిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. అధికారులు కేసును దర్యాప్తుకు తీసుకుని వాస్తవాలను వెలికితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×