E-Paper
Advertisement

Medak Crime: మెదక్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతిపై..

Medak Crime: మెదక్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతిపై..
Advertisement

Medak Crime: మెదక్‌లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించడం లేదనే ఒక్క కారణంతో యువతిని కత్తితో నరికేందుకు యత్నించాడు. చివరకు యువతి తప్పించుకుంది. చివరకు ఆమె చేతికి తీవ్ర గాయమైంది. బాధితురాలని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.

ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు మెదక్ డిగ్రీ కాలేజీకి ఓ యువతి వచ్చింది. ఆమెని కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నాడు కిరణ్ అనే యువకుడు. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. యువతి పరీక్షలు రాసేందుకు డిగ్రీ కాలేజీకి వచ్చింది.

Advertisement

ALSO READ:  చిక్కుల్లో కేంద్రమంత్రి, సురేష్ గోపిపై కేసు

అప్పటికే అక్కడున్న కిరణ్, తనతో తెచ్చుకున్న కత్తితో దాడికి పాల్పడ్డారు. ఆ దాడి నుంచి యువతి తప్పించుకుంది. ఈ క్రమంలో ఆమె చేతికి తీవ్రగాయమైంది. కళాశాల ఆవరణంలో జరగడంతో వెంటనే విద్యార్థులు గమనించి వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేశారు. మెరుగైన వైద్యం కోసం యువతిని హైదరాబాద్‌కి తరలించారు.

Advertisement

కొద్దిరోజులుగా తనను ప్రేమించాలని ఆమె వెంటపడుతున్నాడు యువకుడు. ఆమె అంగీకరించని కారణంగా తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని భావించి ఈ దాడికి పాల్పడ్డాడు. దాడికి పాల్పడిన వ్యక్తి బెంగళూరికి చెందినవాడు. ఘటన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×