BigTV English

VD 14 Update : రౌడీ హీరో మూవీలో డేంజరస్ హాలీవుడ్ యాక్టర్… అప్పుడు మమ్మీలో విలన్… ఇప్పుడు..?

VD 14 Update : రౌడీ హీరో మూవీలో డేంజరస్ హాలీవుడ్ యాక్టర్… అప్పుడు మమ్మీలో విలన్… ఇప్పుడు..?

VD 14 Update : రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonada) మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణం మొదలుపెట్టారు. అలా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషించి, వెలుగులోకి వచ్చిన ఈయన, ఆ తర్వాత పెళ్లిచూపులు సినిమాతో హీరోగా అవతారం ఎత్తారు. మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్న విజయ్ దేవరకొండ, తన రెండవ చిత్రం అర్జున్ రెడ్డి సినిమాలో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయారు. ఈయన లోని రొమాంటిక్ యాంగిల్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ కి అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే అనడంలో సందేహం లేదు.


టాలెంటెడ్ డైరెక్టర్లతో విజయ్ దేవరకొండ..

ఇకపోతే టాలెంటెడ్ డైరెక్టర్ లతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న హీరో విజయ్ దేవరకొండ గతంలో పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో లైగర్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసి ఘోర పరాభవాన్ని అందుకున్నారు. ఇకపోతే ఈ సినిమాలో హాలీవుడ్ లెజెండ్ మైక్ టైసన్ కామెడీ పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే. కనీసం ఈయన ద్వారా అయినా సినిమా హిట్ అవుతుందని అంచనాలు పెట్టుకోగా.. సినిమా పూర్తి డిజాస్టర్ మూటకట్టుకొని.. అటు నిర్మాతగా మారిన ఛార్మీ ,పూరీ జగన్నాథ్ కు పూర్తి నష్టాన్ని మిగిల్చింది.


విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ లైనప్..

ఇక ప్రస్తుతం వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న విజయ్ తన కెరీర్ ను గాడిలో పెట్టడానికి మంచి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లతో జతకట్టి స్ట్రాంగ్ లైనప్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్ సినిమాలో మరో పవర్ఫుల్ హాలీవుడ్ విలన్ కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి ప్రయత్నం సఫలం అవుతుందో విఫలమవుతుందో తెలియదు కానీ ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ చాలా కష్టపడుతున్నట్లయితే తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ సినిమాలో మమ్మీ విలన్..

ఇకపోతే ఆ విలన్ ఎవరో కాదు.. హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ది మమ్మీ సినిమా విలన్.. అతీంద్రియ శక్తులతో శాపగ్రస్తుడైన ప్రధాన పూజారి ఇన్ హోటెప్ పాత్రలో మాస్టర్ క్లాస్ యాక్టింగ్ తో ఆకట్టుకున్న నటుడు ఆర్నాల్డ్ వోస్లూ (Arnold vosloo).. ది మమ్మీ రిటర్న్స్ లో తన అద్భుతమైన పాత్రతో ఆకట్టుకున్నారు. ఈయన ఇప్పటికే ఏజెంట్ కోడి బ్యాంక్స్, బ్లడ్ డైమండ్, సిల్వర్టన్ సీజ్ వంటి సినిమాలలో అదరగొట్టినయ్యను ఇప్పుడు 24, ఎన్సిఐసి, చక్, జాక్ ర్యాన్, బోన్స్, ఎలిమెంటరీ, బాష్, ది బ్లాక్ లిస్ట్ వంటి సూపర్ డూపర్ వెబ్ సిరీస్ లలో నటించి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ 14వ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో విజయ్ తర్వాత ఆర్నాల్డ్ దే కీలకపాత్ర కాబోతోంది అని, ఈ సినిమా 2026 లో విడుదల కాంబోతోందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రముఖ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×