E-Paper
Advertisement

Medak News: స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. 22 మంది విద్యార్థినులకు అస్వస్థత

Medak News: స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. 22 మంది విద్యార్థినులకు అస్వస్థత
Advertisement

మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ (కేజీబీవీ) లో తీవ్ర కలకలం రేగింది. పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న 22 మంది విద్యార్థినులు, ముగ్గురు ఉపాధ్యాయులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం టిఫిన్ చేసిన కాసేపటికే వీరంతా వాంతులు, విరేచనాలతో ఇబ్బందికి గురయ్యారు.

పాఠశాల మెనూ ప్రకారం.. ఉదయం విద్యార్థినులకు, సిబ్బందికి అల్పాహారం వడ్డించారు. టిఫిన్ తిన్న కొద్దిసేపటికే కొంతమంది విద్యార్థినులు కడుపునొప్పితో విలవిలలాడారు. ఆ తర్వాత వరుసగా మరికొందరు వాంతులు చేసుకోవడంతో పాఠశాల ప్రాంగణంలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. విద్యార్థినులతో పాటు విధుల్లో ఉన్న ముగ్గురు ఉపాధ్యాయులు సైతం అస్వస్థతకు గురికావడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది.

Advertisement

విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై బాధితులను స్థానిక రేగోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో వీరికి అత్యవసర చికిత్స అందుతోంది. వైద్యులు బాధితులకు సెలైన్లు ఎక్కించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతానికి అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆహారం కలుషితం కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

గురుకుల పాఠశాలల్లో వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన భోజనం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పాఠశాలలో వంట గదిని, నీటి సౌకర్యాలను తనిఖీ చేయాలని డిమాండ్ వినిపిస్తోంది.

Advertisement

ALSO READ: Bald Head: 30 ఏళ్లకే బట్టతలా ? మగవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన నిజాలివే

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×