BigTV English

Meerpet Murder Case: మీర్ పేట్ మర్డర్ కేసు.. మలయాళ మూవీ చూసే.. భార్యను ముక్కలుగా నరికాడు

Meerpet Murder Case: మీర్ పేట్ మర్డర్ కేసు.. మలయాళ మూవీ చూసే.. భార్యను ముక్కలుగా నరికాడు

Meerpet Murder Case Latest Update: మీర్ పేట్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘సూక్ష్మదర్శిని’ స్ఫూర్తితోనే గురుమూర్తి తన భార్య మాధవిని హత్య చేశాడని పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది. ఇక మూవీలో దత్తతకు తీసుకున్న ఓ కుమార్తెను తల్లీ, కొడుకు కలిసి హత్య చేస్తారు. అంతే కాదు ఆమె శరీర భాగాలను కెమికల్ పోసి మృతదాహాన్ని కరిగించి వాష్‌రూమ్‌లో ఫ్లష్ ద్వారా పంపుతారు. ఈ సినిమాలో మర్డర్ చేసిన విధంగానే గురుమూర్తి కూడా మాధవి డెడ్ బాడీని మాయం చేసినట్లు తెలుస్తోంది.


ఇదిలా ఉంటే.. మీర్‌పేట్ మర్డర్ కేసులో పోలీసుల ఎంక్వైరీ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు.. నిందితుడు ఫోన్ కాల్స్ పై పోలీసులు వివరాలు సేకరించారు. హత్యకు ముందు.. హత్యకు తర్వాత ఎవరెవరితో మాట్లాడారు అనే డౌట్‌తో కాల్ లిస్ట్ చెక్ చేశారు. హత్య తర్వాత గురుమూర్తి 8 ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు. తన స్నేహితుడికి సంక్రాంతికి వస్తున్నాం సినిమా టికెట్స్ బుక్ చేశారు. బడంగ్ పేటలో ఉంటున్న సోదరుడికి ఫోన్ చేశాడు. అయితే గురుమూర్తి స్నేహితుడిని పోలీస్ స్టేషన్‌కి పిలిపించి హత్యపై ఆరా తీశారు.

మరోవైపు మీర్‌పేట్ మర్డర్ కేసులో పోలీసులు సేకరించిన ఆధారాలు కీలకంగా మారాయి. ఇప్పటికే సీజ్ చేసిన ఆధారాలతోనే హత్యగా తెల్చేందుకు పోలీసులు డిసైడయ్యారు. 20 లీడర్ల బకెట్, వాటర్ హీటర్, షర్ట్ హంగ్లర్, కుక్కర్, కడాయి, కత్తి, చెక్క మొద్దును సీజ్ చేశారు. ఆధారాలు అన్నింటిపై ఫింగర్ ప్రింట్, బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు.


బ్లూ రేస్ టెక్నాలజీ ద్వారా సేకరించిన DNA, ఇంట్లో ఉపయోగించిన వస్తువుల ద్వారా హత్యకు ఆధారాలుగా చూపిస్తున్నారు. తొమ్మిది రోజుల తర్వాత పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించారు పోలీసులు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల సహకారం తీసుకొని.. మరింత లోతుగా విచారించారు. మొత్తానికి కేసు ఫైనల్ స్టేజీకి వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: మీర్‌పేట్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. ఇన్‌ఫ్రారెడ్ ద్వారా రక్తపు మరకలు గుర్తింపు

ఇటీవల మీర్‌పేట్ మర్డర్ కేసులో మృతురాలు మాధవి తల్లిదండ్రులు తొలిసారిగా స్పందించారు. అంతా ప్లాన్ ప్రకారమే హత్య చేశాడని మాధవి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో దుర్వాసన రావడం.. వంట గదిలోకి కూడా రానీయకపోవడంతో మావాళ్లకి అనుమానం వచ్చిందని మాధవి తల్లి చెప్పారు. సంక్రాంతి పండుగ రోజు మాధవితో వీడియో కాల్ మాట్లాడానని మాధవి తల్లి చెబుతున్నారు. మంగళవారం, బుధవారం రెండు రోజులు వీడియో కాల్‌లో మాట్లాడానని.. అప్పుడు ఎలాంటి గొడవలు లేవని మాధవి తల్లి స్పష్టం చేశారు. గురువారం చాలా సార్లు మాధవికి ఫోన్‌ చేస్తే లిఫ్ట్ చేయలేదని.. శుక్రవారం ఉదయం 6 గంటలకు ఫోన్‌ చేస్తే లిఫ్ట్ చేయలేదని.. ఫోన్ చేస్తే రెండు రోజులు లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిందని మాధవి తల్లి తెలిపారు.

మీర్‌పేట మర్డర్‌పై విచారణ కొనసాగుతున్నదని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న.. ఎక్స్‌పర్ట్స్‌తో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. నూతన టెక్నాలజీని వినియోగిస్తున్నామని తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని.. ఇంత కంటే ఎక్కువ ఇప్పుడేమీ చెప్పలేమని సీపీ తెలిపారు.

Related News

Kondapur News: హైదరాబాద్‌లో దారుణం.. బౌన్సర్లను చితికబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్

Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం.. పహల్గాం ఘటనను వాడుకుంటూ

Visakhapatnam News: విషాదం.. గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

Medak District: రెచ్చిపోతున్న కామాంధులు.. ఛీ ఛీ గేదెపై అత్యాచారం, ఎక్కడో కాదు..!

Doctor Negligence: ఫుల్‌గా తాగి నిద్రపోయిన డాక్టర్.. నవజాత శిశువు మృతి

Vijayawada News: ఏపీ పోలీసులకు చెమటలు.. చెర నుంచి తప్పించుకున్న బత్తుల, తెలంగాణ పోలీసుల ఫోకస్

Bengaluru News: బెంగుళూరులో దారుణం.. 12 ఏళ్ల కూతురి కళ్ల ముందు.. భార్యని చంపిన భర్త

Robbery In Khammam: దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీ

Big Stories

×