Meerpet Murder Case: మీర్‌పేట్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. హత్య కేసులో భార్యను భర్త చంపినట్లు గుర్తించారు. ఇప్పటికే రెండుసార్లు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత మరోసారి సీన్ రికస్ట్రక్షన్ చేయనున్నారు. అయితే ఇప్పటికే కీలకమైన ఆధారాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. మూడు గంటల పాటు గురుమూర్తి ఇంట్లో సోదాలు నిర్వహించి కీలకమైన ఆధారాలను సేకరించారు క్లూస్ టీమ్. బ్లూ రేస్ టెక్నాలజీ ద్వారా గురుమూర్తి ఇంట్లో కీలక ఆధారాలు సేకరించారు. గురుమూర్తి ఇంట్లో బాత్రూంలో బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. పోలీసులు సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు పోలీసులు. హత్యకు ముందు రోజు భార్యను గురుమూర్తి సినిమాకు తీసుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు.
మీర్‌పేట్ మర్డర్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. గురుమూర్తి పిల్లల స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. పండుగ తరువాత ఇంట్లోకి రాగానే దారుణమైన వాసన వచ్చిందని గురుమూర్తి కూతురు చెప్పినట్టు తెలుస్తోంది. అమ్మ ఎక్కడా అని అడిగితే.. నాన్న మౌనంగా ఉన్నాడని పోలీసులకు తెలిపింది. మాధవిని హత్య చేశానని పోలీసుల ముందు గురుమూర్తి ఒప్పుకున్నప్పటకీ.. చంపిన విధానంపై పోలీసులకు 2,3 వెర్షన్స్ చెబుతున్నట్టు సమాచారం.
ఇంట్లోని బాత్ రూమ్ లోనే మాధవి మృతదేహాన్ని కత్తితో ముక్కలు ముక్కలు చేసి.. రక్తపు మరకలు కనిపించకుండా 10 సార్లు కడిగినట్టు చెబుతున్నాడు. అయితే గురుమూర్తి పొంతనలేని సమాధానాలతో పోలీసులు తలపట్టుకుంటున్నారు. ఇక నిన్న రాత్రి గురుమూర్తిని మరోసారి చెరువు దగ్గరకి తీసుకెళ్లారు. కానీ చెరువులో మాధవి ఆనవాళ్లు ఏవి లభ్యం కాలేదని అంటున్నారు.
ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోండగా.. ఆధారాలు సేకరించడం పెద్ద తలనొప్పిగా మారింది. భార్యను హత్య చేసిన తర్వాత ఆధారాలు దొరకకుండా.. గురుమూర్తి జాగ్రత్తలు పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆధారాలు సేకరించేందుకు.. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వద్ద ఉన్న బ్లూ రేస్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. 2018లో ఉప్పల్ లో జరిగిన నరబలి కేసులో కూడా ఈ టెక్నాలజీనే వాడారు. క్లూస్ టీం, పోరెన్సిక్ విభాగాలు కొన్ని ఆధారాలు సేకరించాయి.
Also Read: ఇంట్లో నుంచి కంపు.. పక్కింటోళ్లు అడిగితే.. కుక్కర్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు..
ఈ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో హీటర్, కుక్కర్, టాయిలెట్ గోడలపై ఉండే రక్తపు మరకలను గుర్తించాయి. అలానే అక్కడ లభించిన వెంట్రుకలు, గాజులు మరికొన్ని వస్తువులను ఫోరెన్సిక్ విభాగం సేకరించింది. ఆధారాలను విశ్లేషించిన తర్వాతే ఘటనపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఇక సీసీ కెమెరాల్లో గురుమూర్తి ఒక సంచి తీసుకెళ్తున్న ఆనవాళ్లు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో సీసీ కెమెరాల విజువల్స్ కీలకం కానున్నాయి. బిఎన్ఎస్ చట్టంలో ఎలక్ట్రానిక్ కు సంబంధించిన సాక్షాలు కూడా చెల్లుతాయని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు మాధవి మృతదేహా ఆనవాళ్లు దొరికితే తప్ప కేసు ముందుకు కదిలే పరిస్థితి లేదంటున్నారు పోలీసులు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడికించి.. ఎముకలను పొడిగా దంచి చెరువులో కలిపానని గురుమూర్తి విచారణలో వెల్లడించారు. ఆయన చెప్పిన మాటలు నిజమా? అబద్దమా అని విచారణ చేస్తున్నారు.