WI vs Pak 2nd Test: పాకిస్తాన్ – వెస్టిండీస్ మధ్య ముల్తాన్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. ఈ మ్యాచ్ లోని తొలి ఇన్నింగ్స్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ {West Indies} జట్టు 41 ఓవర్లలో 163 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. గుడాకేష్ మోతే {Gudakesh Motie} ఒక్కడే హాఫ్ సెంచరీ తో రాణించాడు. ఈ మొదటి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ {Pakistan } బౌలర్ నమన్ అలీ హైట్రిక్ సహా.. 6 వికెట్లు పడగొట్టి వెస్టిండీస్ ని కోలుకోలేని దెబ్బతీశాడు.
Also Read: Jasprit Bumrah: న్యూజిలాండ్ లో బుమ్రాకు ఆపరేషన్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్?
అనంతరం బరిలోకి దిగిన పాకిస్తాన్ {Pakistan } తన తొలి ఇన్నింగ్స్ లో 47 ఓవర్లలో 154 పరుగులకే కుప్ప కూలింది. వికెట్ కీపర్ రిజ్వాన్ 49 పరుగులు చేసి హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. వెస్టిండీస్ {West Indies} బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. గోమేల్ వార్రికన్ 4, గుడాకేష్ మోతే 3, కీమర్ రోచ్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 9 పరుగుల లీడ్ తో తన రెండవ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన వెస్టిండీస్ 66.1 ఓవర్లలో 244 పరుగులకు అవుట్ అయింది.
బ్రాత్ వైట్ 74 బంతులలో 52 పరుగులతో రాణించాడు. {West Indies} అమీర్ జంగూ 30, టెవిన్ ఇమ్లాచ్ 35 ఓ మోస్తరు పరుగులు చేశారు. పాకిస్తాన్ {Pakistan } బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమన్ అలీ తలో నాలుగు వికెట్లు పడగొట్టారు. ఇక అబ్రార్ అహ్మద్, కషిఫ్ అలీ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 255 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ రెండవ రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది.
మూడవరోజు ఆట ప్రారంభమైన కాసేపటికి ఐదవ వికెట్ ని కూడా కోల్పోయింది. ప్రస్తుతం పాకిస్తాన్ {Pakistan } 34 ఓవర్లలో 103 పరుగులు చేసి ఆరు వికెట్లను కోల్పోయింది. వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ (14*), స్లామన్ అఘా (12*) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అయితే ఈ మ్యాచ్ లోని రెండవ రోజు ఆటలో గుడాకేష్ మోతే {Gudakesh Motie} బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అభిమానులు ఈ మ్యాచ్ ని ఆసక్తిగా చూస్తున్న సమయంలో ఆన్ ఫీల్డ్ యాక్షన్ పై కెమెరామెన్ అనుకోకుండా వెస్టిండీస్ {West Indies} క్రికెటర్ గుడాకేష్ మోతే వైపు హైలెట్ చేశాడు.
Also Read: Jasprit Bumrah: “కోల్డ్ ప్లే” కన్సర్ట్ లో బుమ్రా సందడి.. దద్దరిల్లిన ఈవెంట్!
దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. గుడాకేష్ మోతే {Gudakesh Motie} లోదుస్తులు లేకుండా దర్శనమివ్వడంతో ఆ కెమెరామెన్ పై అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియా {Social media} లో వైరల్ గా మారడంతో నెటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. వీడెవడ్రా బాబు.. లోదుస్తులు లేకుండానే మ్యాచ్ ఆడుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
— on-the-one 🇬🇾 (@0ntheone) January 26, 2025