HBD Bobby Deol:ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ (Bobby Deol) కి తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభిస్తున్న విషయం తెలిసిందే..అందులో భాగంగానే ఇటీవల ఆయన తెలుగులో నటిస్తున్న ప్రతి సినిమా కూడా మంచి విజయం అందుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవల బాబీ కొల్లి(Bobby kolli) డైరెక్షన్లో బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన ‘డాకు మహారాజ్ ‘ సినిమాలో విలన్ గా నటించి, అందరిని అబ్బురపరిచారు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఇందులో కూడా విలన్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈరోజు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ పుట్టినరోజు కావడంతో చిత్ర బృందం ‘హరిహర వీరమల్లు’ నుండి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేసింది.
ఆకట్టుకుంటున్న బాబీ డియోల్ ఫస్ట్ లుక్ పోస్టర్.
ఈ పోస్టర్లో బాబీ డియోల్ చేత కత్తి పట్టుకొని యుద్ధానికి సిద్ధం అన్నట్టు కనిపించారు. ఇక ఆయన లుక్ చూస్తుంటే యుద్ధాన్ని తలపించేలా సరికొత్త జానర్లో ప్రేక్షకులను ఆకట్టుకో బోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ నుండి ఇలాంటి సినిమాలే కదా మాకు కావాల్సింది అని ఆడియన్స్ సైతం కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ మధ్యకాలంలో బాబీ డియోల్ తెలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాతో కూడా మరొకసారి అలరించడానికి సిద్ధం అయ్యారని చెప్పవచ్చు
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
ఇకపోతే బాబీ డియోల్ ఫస్ట్ లుక్ తో పాటు సినిమా విడుదల తేదీని కూడా పోస్టర్లో మేకర్స్ అనౌన్స్ చేయడం జరిగింది. 2025 మార్చి 28వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దర్శకుడు జ్యోతి కృష్ణ (Jyothy krishna) తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రాబోతోంది. ఇక ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న బాబీ డియోల్ గత వారం క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాపై ఆసక్తికర కామెంట్లు చేశారు.
సినిమాపై హైప్ పెంచిన బాబీ డియోల్..
బాబీ డియోల్ మాట్లాడుతూ.. “హరిహర వీరమల్లు స్క్రిప్ట్ చాలా యూనిక్ స్క్రిప్ట్. అరుదుగా మాత్రమే ఇలాంటి కథలు తెరపైకి వస్తాయి. గతంలో జరిగిన కథలు, మంచి ఎమోషనల్ గా కూడా ఉంటాయని, మొదటిసారి కథ విన్నప్పుడే నాకు అనిపించింది. నాకు ఎంతో నచ్చింది. ఇలాంటి సినిమాలో భాగమైనందుకు నాకు మరింత ఆనందంగా ఉంది” అంటూ బాబి డియోల్ తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇందులో నిధి అగర్వాల్ (Nidhi agarwal), నర్గీస్ ఫక్రి (Nargis Fakhri), నోరా ఫతేహి (Nora fatehi) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి (MM .Keeravani) సంగీతాన్ని అందిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్లు బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాను మేఘ సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నట్లు సమాచారం. మరి ఇంత భారీ బడ్జెట్ తో, భారీ అంచనాల మధ్య 17వ శతాబ్దపు కాలంనాటి మొగల్ సామ్రాజ్యపు నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.