Jillela Guda murder case : హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న ఓ ఉద్యోగి ఇంట్లో రాత్రి వేళ ఒంటరిగా కూర్చుని.. క్రైమ్ సినిమాలు చూస్తున్నాడు. చాలా మందికి అలాంటి సినిమాల్లోని థ్రిల్ ఇష్టం.. కానీ ఆ వ్యక్తికి అందులోని నేరస్తులు ఆలోచనలు ముఖ్యం. వాళ్లు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది కావాలి. వాళ్లు ఎలా నేరం చేస్తున్నారు.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఎలా ప్లాన్లు వేస్తున్నారు అనే విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. సినిమాల్లో హత్యలు చేసి తప్పించుకునే పద్ధతుల్ని అధ్యయనం చేసి, తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేశాడు. మళ్లీ అవే విషయాల్ని శోధిస్తున్నాడు.
అతనికి అంత ఇంట్రెస్ట్ ఎందుకంటే.. అతనేమీ క్రైమ్ సినిమాల ప్రేమికుడు కాదు. మరెందుకు.. ఎందుకంటే.. అతనింట్లో ఇప్పుడు ఓ శవం ఉంది. ఎవరికీ అనుమానం రాకుండా.. ఆ మృతదేహాన్ని మాయం చేయాలి. అందుకే.. అతని ప్రయత్నం. సినిమాలు, యూట్యూబ్ లో చెప్పే విషయాల్ని చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకుని.. చివరిగా ఓ నిర్ణయానికి వచ్చాడు. ఇంట్లో శవాన్ని మాయం చేసేందుకు కొత్త పథకాన్ని రచించాడు. ఈ వ్యవహారం అంతా జరిగింది ఎక్కడో కాదు.. హైదరాబాద్ లోని జిల్లెలగూడలో.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఈ కేసులో నేరస్తుడు వ్యవహరించిన తీరు ఓ కేస్ స్టడీ అంటున్నారు.. పోలీసులు. ఇంతకీ.. ఈ కేసులోని ట్విస్టులు ఏంటి.? వాటిని పోలీసులు ఎలా చేధించారు.?
గొడవకు కారణం ఏంటి.?
హైదరాబాద్ లో భర్త చేతిలో హత్యకు గురైన వెంకట మాధవి కేసు విచారణలో వేగం పెరుగుతున్న కొద్దీ.. అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయాలు తెలుసుకుని పోలీసులతో సహా మిగతా వాళ్లు సైతం ఆశ్చర్యపడుతున్నారు. తొలుత వెంకట మాధవీ హత్యుకు వేర్వేరు కారణాలున్నట్లు వార్తలు వచ్చాయి. చుట్టు పక్కల వాళ్లు, తెలిసిన వాళ్లు సైతం అనేక ఊహాగానాలు వ్యాప్తి చేశారు. కానీ.. ఈ వార్తలన్నింటినీ పోలీసులు కొట్టిపారేశారు. తమ విచారణలో వెల్లడైన విషయాల్ని వెల్లడించారు. సంక్రాంతి సందర్భంగా పిల్లల్ని అమ్మమ్మ గారింటికి పంపించిన దంపతులు.. పండుగకు ఎక్కడికి వెళ్లాలి అనే విషయమై వాదన మొదలైనట్లు తెలుస్తోంది.
తన పుట్టింటికి వెళ్లాలని వెంకట మాధవి భర్తకు చెప్పగా.. పుట్టింటికి వద్దని తన చెల్లెలి ఇంటికి వెళ్దామన్న గురుమూర్తి తెలిపాడు. అక్కడ వీరిద్దరికీ మాటామాటా పెరిగింది. దాంతో.. తాను గురుమూర్తి చెల్లెల్లి ఇంటికి వచ్చే ప్రసక్తే లేదని తేల్చిన మాధవి.. తన అమ్మానాన్నల దగ్గరికే వెళ్తానని పట్టుబట్టింది. సరేమిరా వద్దని వాదించిన గురుమూర్తి.. ఈ పండుగను తప్పనిసరిగా తన చెల్లెలి కుటుంబంతో గడపాలన్నాడు. అలా.. క్రమంగా వీరిద్దరి మధ్య ఘర్షణ పెరిగిపోగా.. తాళిబొట్టును తీసిన మాధవి కోపంగా భర్త ముఖాన కొట్టింది. దాంతో.. అప్పటికే కోపంగా ఉన్న గురుమూర్తి బలంగా భార్యను కొట్టాడు. ఒక్క ఉదుటున మాధవి తలను గోడకేసి కొట్టాడు. దాంతో.. తీవ్రంగా గాయపడిన ఆమె తొలుత సృహ తప్పి పడిపోయింది. కొద్ది నిముషాల్లోనే ప్రాణాలు కోల్పోయింది.
సినిమాలు చూసి శవం మాయం
అనుకోని విధంగా భర్య మరణించడంతో ఒక్కసారిగా షాక్ కి గురైన గురుమూర్తి.. నేరం నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ఆలోచించాడు. హత్య నుంచి తప్పించుకునేందుకు క్రైమ్ సినిమాల ద్వారా ఏమైనా దారి దొరుకుతుందేమో అని ఆశపడ్డాడు. దాంతో.. రాత్రంతా కూర్చుని క్రైమ్ సినిమాలు చూశాడు. యూట్యూబ్ నుంచి క్రైమ్ పాఠాలు నేర్చుకున్నాడు. వాటిలో ఎక్కడ నుంచి తెలుసుకున్నాడో ఏమో కానీ.. కట్టుకున్న భార్యను ముక్కలు ముక్కలుగా నరికేశాడు.
ఏ సినిమాలో చూశాడో, ఏ యూట్యూబ్ ఛానెళ్లో చెప్పారో కానీ.. మృతదేహాన్ని ముక్కలుగా నరికేసి పెద్ద గ్యాస్ పొయ్యి మీద కాల్చాడు. ఇంట్లో నుంచి కమురు వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్లు భరించలేకపోయారు. అప్పటి వరకు కాస్త అలజడిగా ఉన్న ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం.. లోపలి నుంచి వాసన రావడంతో అర్థం కాని పక్కింటోళ్లు.. ఏంటని ప్రశ్నించారు. ఇంట్లో నుంచి వచ్చిన గురుమూర్తి పండక్కి మేక తల తీసుకొచ్చినట్లు చెప్పాడు. గ్యాస్ మీద మేక తల కాలుస్తున్నా అని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఎక్కడో అనుమానంగా ఉన్నా.. ఎవరూ ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారు.
Also Read : భార్యను చంపి కుక్కర్‌లో ఉడికించిన కసాయి భర్త.. ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడంటే..
ఇక శవాన్ని ఇంట్లో నుంచి మాయం చేసేందుకు మరో ఉపాయాన్ని ఆలోచించిన గురుమూర్తి.. కాల్చిన భార్య శవం ముక్కల్ని బకెట్ లో వేసుకుని జిల్లెలగూడ చెరువు దగ్గరకి వెళ్లాడు. ఎవరికీ అనుమానం రాకుండా చెరువులో పడేసి చేతులు దులుపుకున్నాడు. అనుకున్న తీరుగా భార్య శవాన్ని మాయం చేశాననుకుంటూ.. ఇంటికి వచ్చి ఫినాయిల్ తో ఇంటిని శుభ్రం చేశాడు.