Rinku Singh: టీమిండియా ( Team India ) డేంజర్ ప్లేయర్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ( KKR ) ఆటగాడు రింకూ సింగ్ ( Rinku Singh ) గురించి తెలియని వారుండరు. ఐపీఎల్ ( IPL )టోర్నమెంట్ లో ఐదు బంతుల్లో వరుసగా 5 సిక్సర్లు బాది ప్రపంచ క్రికెట్ ను ఉర్రూతలు ఊగించిన రింకూ సింగ్ పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం యువ ఎంపీ ప్రియ సరోజ్, రింకు సింగ్ ల ఎంగేజ్మెంట్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమానికి రింకు సింగ్ తో పాటు కొంతమంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారట.
Also Read: Yuzvendra Chahal: అర్థరాత్రి 12 గంటలకు ఆ మిస్టరీ లేడీతో చాహల్ వీడియో కాల్స్ !
అయితే రింకూతో తమ కూతురి నిశ్చితార్థం జరిగినట్లుగా వచ్చిన పుకార్లను ప్రియా సరోజ్ ( Priya Saroj ) తండ్రి కొట్టి పారేశాడు. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది నిజమే అయినప్పటికీ ఎంగేజ్మెంట్ ఇంకా జరగలేదని చెప్పాడు. అటు రింకూ సింగ్ తండ్రి ఖాన్ చంద్ కూడా వస్తున్న మాత్రమే వార్తలను ధ్రువీకరించలేదు. రింకు సింగ్ వచ్చే సంవత్సరం వరకు పెళ్లి చేసుకునే ఆలోచనలు లేవని చెప్పాడు. అయితే ప్రియా తండ్రి మాత్రం పెళ్లికి సంబంధించిన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పాడు.
ఏదేమైనా ఈ విషయంపై రింకూ సింగ్ స్పందిస్తే తప్ప అసలు విషయం తెలియదు. ఈ వివాదం సర్దుమనిగేలా లేదు. రింకూ సింగ్ కు కాబోయే భార్య ప్రియా సరోజ్ ఉత్తరప్రదేశ్ లోని మచిలీ షహార్ నియోజకవర్గం నుంచి లోక్ సభ ఎంపీగా కొనసాగుతోంది. గతంలో ఆమె సుప్రీంకోర్టులో లాయర్ గా కూడా పనిచేసింది. అయితే.. తాజాగా అందుతున్న సమచారం ప్రకారం అయితే..యువ ఎంపీ ప్రియ సరోజ్ ను ( Priya Saroj ) పెళ్లి చేసుకుంటే.. సుమారు.. రూ.500 కోట్ల ఆస్తి రింకూ సింగ్ కు ( Rinku Singh ) రానుందట. యువ ఎంపీ ప్రియ సరోజ్ పేరు పైన ఉన్న ఆస్తులు అన్ని ఇచ్చేందుకు ఆమె తండ్రి నిర్ణయం తీసుకున్నారట. కాగా రింకు సింగ్ ప్రస్తుతం దేశవాళీ టోర్నీలో అదరగొడుతున్నారు. ఐపీఎల్ లో అరంగేట్రం చేసి ప్రస్తుతం టీ20 స్పెషలిస్టుగా స్థిరపడ్డాడు.
Also Read: Virender Sehwag Divorce: షాకింగ్.. విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్.?
తన ప్రదర్శనతో ఏకంగా భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు. అయితే అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ ఆటగాడిగా పేరు సంపాదించుకున్నాడు. కాగా, వచ్చే సీజన్ ఐపీఎల్ కోసం రింకు సింగ్ ను కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు రూ. 13 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది. అంతకు ముందు ఇంగ్లాండ్ తో జరగనున్న టి20 సిరీస్ లో రింకు సింగ్ పాల్గొననున్నాడు. ఇక ఇప్పటికే ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య మొదటి టీ 20 మ్యాచ్ కూడా పూర్త అయింది. ఇందులో టీమిండియా విజయం సాధించింది. కానీ టీమిండియా డేంజర్ ప్లేయర్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆటగాడు రింకూ సింగ్ కు ( Rinku Singh ) మొదటి మ్యాచ్ లో బ్యాటింగ్ చేసే ఛాన్సు రాలేదు.