BigTV English

Kerala Crime : మీరు మనుషులేనా అనిపించే ఘటన – మైనర్ బాలికను చిదిమేసిన 50 మంది దుర్మార్గులు

Kerala Crime : మీరు మనుషులేనా అనిపించే ఘటన – మైనర్ బాలికను చిదిమేసిన 50 మంది దుర్మార్గులు

Kerala Crime : కేరళలో ఓ దారుణ అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలికపై ఐదేళ్లుగా దాదాపు 60 మందికి పైగా అత్యాచారానికి పాల్పడ్డ అమానవీయ నేరం బయటపడింది. ఇన్నేళ్లుగా ఆ దుర్మార్గులకు భయపడిన బాలిక.. ఎట్టకేలకు తాను చదివే కాలేజీలోని కౌన్సిలర్ దగ్గర తనపై జరుగుతున్న అత్యాచారాల విషయమై తెలపడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాగా.. తొలిసారి ఆమెపై రేప్ జరిగినప్పుడు 13 ఏళ్లే కాగా, ఇప్పడు ఆమెకు 18 ఏళ్లు. ఈ మధ్యకాలంలో ఆమెను బెదిరింది, భయపెట్టి.. 60 మంది మైనర్ బాలురు, పాఠశాల విద్యార్థులు, పాఠశాల సిబ్బంది సహా ఆమె గ్రామంలోని అనేక మంది ఉన్నట్లుగా ఆ బాలిక తెలపడంతో.. ఈ అత్యాచారం ఘటన కేరళలో సంచలనంగా మారింది.


కేరళలోని ఓ పేద కూలీ కార్మికుల కుమార్తె అయిన 13 ఏళ్ల బాలికపై.. అదే గ్రామానికి చెందిన పొరుగింటి వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెపై అత్యాచారాని పాల్పడినప్పుడు వీడియో తీశాడు. ఆపై.. ఆ ఫోటోలు, వీడియోలు చూపించి.. ఆమెను బ్లాక్ మెయిల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆమె వీడియోలు చూపించే.. ఐదేళ్లల్లో అనేక మంది ఆమెను లైంగికంగా వేధించినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బాలికపై లైంగిక దాడి, అత్యాచారం, సామూహిక అత్యాచారం కేసులో మొత్తం 58 మంది పురుషులు, బాలులను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు వ్యక్తులు దేశం విడిచి పారిపోయారని కేరళ పోలీసు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ అజీతా బేగం మీడియాకు వెళ్లడించారు. నిందితుల్లో ఆమె పాఠశాల సహచరులు, ఆమె బంధువులు, ఆమె పొరుగువారు ఉన్నారని.. నిందితుల్లో మైనర్ల నుంచి 40 ఏళ్ల వరకు ఉన్న వారున్నారని పోలీసులు వెల్లడించారు.

తొలుత అత్యాచారాని పాల్పడిన వ్యక్తి తీసిన వీడియోలతో ఆమెపై దుర్మార్గం మొదలు కాగా.. చాలా మంది ఆమెను బెదిరించి, భయపెట్టి లొంగదీసుకున్నారని తెలిపారు. అలాగే.. ఆమెను వేధించిన వారిలో ముగ్గురు యువకులు ఆమెను పెళ్లి చేసుకుంటామని హామీ ఇచ్చినట్లుగా పోలీసుల విచారణలో వెలుగుచూసింది. ఇంకో యువకుడు.. ఆమెపై జరిగిన రేప్ గురించి చెబితే.. చంపేస్తానని బెదిరించినట్లుగా గుర్తించారు. ఈ కేసులో కొందరు యువకులు ఒంటరిగా అత్యాచారానికి పాల్పడితే, మరికొందరు సామూహికంగా ఈ దారుణానికి పాల్పడినట్లుగా గుర్తించారు. అయితే.. ఇవన్నీ వేరువేరు కేసులైనా.. మొత్తంగా ఓ ఐదు, ఆరుగురు మొత్తం కేసులకు కారణం అవుతారని తెలుపుతున్నారు.


Also Read : Mass Wedding Scam : ఉచిత వివాహం చేస్తాం.. కానుకలు ఇస్తాం.. అంతా మోసం!

ఈ కేసులో బాధిత బాలిక తల్లిదండ్రులు కూలీలు కావడంతో.. వారికి తమ కుమార్తెపై జరిగిన వేధింపుల గురించి తెలియదని పోలీసులు తెలిపారు. ప్రభుత్వ డేటా ప్రకారం.. కేరళలో నమోదైన 98% కంటే ఎక్కువ అత్యాచార కేసుల్లో నిందితుడు బాధితురాలికి తెలిసిన వాళ్లే కావడం గమనార్హం. కాగా.. రాష్ట్రంలో నమోదైన బాలల లైంగిక వేధింపుల కేసుల సంఖ్య 2013లో నమోదైన 1,002 అయితే.. ఆ మరుసటి ఏడాదే 2023లో 4,663కి అంటే నాలుగు రెట్లు పెరిగింది. ఈ కేసులో పోలీసులు క్రమంగా పురోగతి సాధిస్తున్నారు. వారు.. నిందితుల్ని ఒక్కక్కర్ని జైలుకు పంపిస్తున్నారు.

Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×