Sudeep – CCL: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Celebrity Cricket League 2025 Tournament ) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో ఏకంగా ఏడు జట్లు తలపడుతున్నాయి. ఈ టోర్నమెంట్ చివరి దశకు వచ్చింది. అయితే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ లో… రియల్ మ్యాచ్ తరహాలోనే ఆడుతున్నారు అందరూ ప్లేయర్లు. అవసరమైతే గొడవకు కూడా దిగుతున్నారు. ఈ తరుణంలోనే ఈ టోర్నమెంట్ లో చాలా గొడవలు జరిగాయి. అయితే తాజాగా కర్ణాటక బుల్డోజర్స్ టీంకు ( Karnataka Bulldozers ) సంబంధించిన హీరో కిచ్చా సుదీప్ ( Kiccha Sudeep )… ఓ వివాదానికి తెర లేపాడు.
Also Read: Ind vs Pak: దుబాయ్ లో కుప్పకూలిన పాక్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే ?
తాజాగా… సెలబ్రిటీ క్రికెట్ 2025 టోర్నమెంట్లో… పంజాబ్ ది షేర్ ( Punjab de Sher ) వర్సెస్ కర్ణాటక బుల్డోజర్స్ జట్ల మధ్య ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో… చివరకు కర్ణాటక బుల్డోజర్స్ టీం గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. కేవలం రెండు పరుగులు తేడాతో విజయం సాధించింది కర్ణాటక టీం. నరాలు తెగే ఉత్కంఠత నెలకొల్పిన ఈ మ్యాచ్ లో హీరో సుదీప్ ( Kiccha Sudeep’s intense fight ) అలాగే పంజాబ్ జట్టుకు సంబంధించిన నింజా ఎన్జే ( Ninja NJ ) మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ ఒకరిపై మరొకరు మాటలతోటాలను పేల్చుకున్నారు. దీంతో దాదాపు పది నిమిషాల పాటు మ్యాచ్ కూడా ఆగిపోయింది. అయితే అక్కడ పరిస్థితి దాటిపోయేలా కనిపించడంతో… జట్టు సభ్యులు అలాగే అంపైర్లు.. రంగంలోకి దిగి వాళ్ళ గొడవను కంట్రోల్ చేశారు. దీంతో ఆ గొడవ అక్కడికక్కడే ఆగిపోయింది. అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్లీ ఇద్దరూ కలుసుకున్నారు. చిరునవ్వుతో… పలకరించుకొని.. షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకున్నారు.
Also Read: Chiranjeevi in Ind vs Pak match: దుబాయ్ మ్యాచ్ కు చిరు, టీడీపీ నేతలు…అభిషేక్ శర్మతోనే సిట్టింగ్ !
దీంతో ఈ వివాదం అక్కడికక్కడే సమసిపోయింది. ఇది ఇలా ఉండగా…. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ టోర్నమెంట్లో… ఈసారి తెలుగు వారియర్స్ పెద్దగా రాణించలేదు. ఇప్పటి వరకు అయినా మ్యాచ్ ల ప్రకారం… పాయింట్స్ టేబుల్ లో బెంగాల్ టైగర్స్… టాప్ లో ఉంది. ఈ తరుణంలోనే నాలుగు జట్లు… సీసీఎల్ సెమి ఫైనల్ కు క్వాలిఫై అయ్యాయి. టాప్ లో బెంగాల్ టైగర్స్ ఉండగా, రెండవ స్థానంలో కర్ణాటక బుల్డోజర్స్ ఉంది. మూడవ స్థానంలో చెన్నై ఉండగా నాలుగో స్థానంలో పంజాబ్ బరిలో నిలిచింది. ఈ నాలుగు జట్ల మధ్య సెమీఫైనల్ జరుగుతుంది. అందులో రెండు గెలుస్తాయి. ఆ రెండు జట్లు ఫైనల్ ఆడుతాయి. ఈసారి తెలుగు వారియర్స్ కింది నుంచి రెండవ ప్లేస్ అంటే ఆరవ స్థానంలో నిలిచింది. ఈ టోర్నమెంట్లో నాలుగు మ్యాచ్లు ఆడిన తెలుగు వారియర్స్ ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. అది కూడా భోజ్ పూరి జట్టు పైన గెలవడం జరిగింది. మిగిలిన మూడు మ్యాచ్ లో తెలుగు వారియర్స్ దారుణంగా ఓడిపోయింది.
Happening something
Good decision by @KicchaSudeep after that pic.twitter.com/snl4i9fbee
— AHR (@AhrMys) February 22, 2025