Sundeep Kishan: ఈరోజుల్లో సీనియర్ హీరో, యంగ్ హీరో అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరికి ఏదో ఒక ట్యాగ్ తగిలిస్తున్నారు ఫ్యాన్స్. కొన్నిసార్లు ఆ ట్యాగ్స్ క్రియేట్ అవ్వడానికి ఫ్యాన్స్ కారణం అయితే.. కొన్నిసార్లు మేకర్స్ కారణమవుతారు. ఒక ట్యాగ్ లేని హీరోతో సినిమా చేయగానే మేకర్సే తమకు ఒక ట్యాగ్ ఉంటే బాగుంటుందని ఫీల్ అయ్యి దానిని యాడ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. తాజాగా యంగ్ హీరో సందీప్ కిషన్ విషయంలో కూడా అదే జరిగింది. కానీ సందీప్‌కు ఇచ్చిన ట్యాగ్.. ఇతర హీరో ఫ్యాన్స్‌కు నచ్చలేదు. దీంతో తనపై నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అందుకే ఈ విషయంపై సందీప్ కిషన్ స్వయంగా స్పందించాడు. పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యాడు.
ప్రమోషన్స్‌లో బిజీ
యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ ‘మజాకా’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఇది సందీప్ కెరీర్‌లో 30వ సినిమాగా తెరకెక్కింది. అందుకే ఈ మూవీని ఎలాగైనా తన కెరీర్‌లో గుర్తుండిపోయే మైల్‌స్టోన్‌లాగా నిలిచేలా చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. దాదాపు నెల రోజుల ముందు నుండే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తన ప్రతీ సినిమాలాగానే ఈ సినిమాపై కూడా ప్రత్యేకంగా శ్రద్ధపెట్టి ప్రమోషన్స్ చేస్తున్నాడు సందీప్ కిషన్. అలా తాజాగా ప్రమోషన్స్‌లో తనకు పీపుల్స్ స్టార్ అనే ట్యాగ్ ఇవ్వడంపై పెద్ద చర్చే జరిగింది.
ఫ్యాన్స్ ఫైర్
‘మజాకా’ (Mazaka) సినిమా కోసం సందీప్ కిషన్‌కు పీపుల్స్ స్టార్ అనే ట్యాగ్ యాడ్ చేశారు మేకర్స్. అసలైతే ప్రజల కోసం సినిమాలు తెరకెక్కించి, వాటినుండి ఏమీ ఆశించకుండా, లాభాలు రాకపోయినా పర్వాలేదు అనుకునే ఆర్ నారాయణ మూర్తిని ఒకప్పుడు పీపుల్స్ స్టార్ అని పిలిచేవారు. ఇప్పటికీ ఆయన ఫ్యాన్స్ ఆయనను అలాగే పిలుస్తారు. ప్రజల కోసం సినిమాలు తీసేవారు కాబట్టి ఆయనకు అభిమానులంతా ఆ పేరు పెట్టారు. అలాంటి ట్యాగ్‌ను హక్కుగా తీసుకొని ఉపయోగించడంతో సందీప్ కిషన్‌పై నారాయణ మూర్తి ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో సందీప్‌కు ఈ ట్యాగ్ గురించే ప్రశ్న ఎదుయ్యింది.
Also Read: నా అంత గొప్ప నటుడు లేడు.. మీరు నా లైనప్ చూశారా.?
నాకు నిజంగా తెలియదు
ఆర్ నారాయణ మూర్తికి పీపుల్స్ స్టార్ అనే ట్యాగ్ ఉన్న విషయం తనకు నిజంగా తెలియదని బయటపెట్టాడు సందీప్ కిషన్ (Sundeep Kishan). తాను అసలు ఇలాంటి ట్యాగ్స్‌పై ఇంట్రెస్ట్ చూపించనని చెప్పేశాడు. పీపుల్స్ స్టార్ అనే ట్యాగ్‌ను తనకు యాడ్ చేసిన తర్వాతే నారాయణ మూర్తికి కూడా అలాంటి ట్యాగ్ ఉండేదని తెలిసిందని క్లారిటీ ఇచ్చాడు. అందుకే ఈ ట్యాగ్ వల్ల ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఏం చేయాలో తనకు తెలుసని హామీ ఇచ్చాడు సందీప్ కిషన్. మొత్తానికి సందీప్ ఇంత పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వడంతో నారాయణ మూర్తి ఫ్యాన్స్ కూడా కాస్త కుదుటపడ్డారు.