E-Paper
Advertisement

నలుగురిపైకి దూసుకెళ్లిన రైలు.. గాల్లోకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి!

నలుగురిపైకి దూసుకెళ్లిన రైలు.. గాల్లోకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి!
Advertisement

Train Accident: మధ్యప్రదేశ్‌లోని హేతంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఊహించని ఘోర ప్రమాదం జరిగింది. ఖజురహో-ఉదయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడి మొబైల్ ఫోన్ పేలింది. దీంతో బోగీలో మంటలు చెలరేగాయంటూ ఒక్కసారిగా పుకార్లు షికార్లు చేశాయి. ఊపిరి ఆగిపోయేంత భయాందోళనకు గురైన ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకోవడానికి వెంటనే రైలు చైన్‌ను లాగారు. రైలు ఆగీఆగడంతోనే బోగీల నుంచి కిందికి దూకేశారు.

చీకటి పడుతున్న సమయం కావడం, ప్రాణభయంతో ఏం చేస్తున్నామో తెలియకపోవడంతో ప్రయాణికులంతా పక్కనే ఉన్న మరో రైల్వే ట్రాక్‌పైకి చేరారు. దురదృష్టవశాత్తూ అదే సమయంలో పక్క ట్రాక్ పైనుంచి పాతాళ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ వేగంగా దూసుకొచ్చింది. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘోరంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే రైలు కిందపడి ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Also Read: అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. స్టార్ క్యాంపెయినర్ గౌతమి అవుట్!

మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. క్షణకాలం పాటు వ్యాపించిన తప్పుడు పుకారు, నలుగురి ప్రాణాలను బలితీసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. రైల్వే అధికారులు ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×