E-Paper
Advertisement

ఫోన్, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్ అన్నింటికీ ఒకే ఛార్జర్.. టాప్-5 వైర్‌లెస్ ఛార్జర్స్ లిస్ట్ ఇదిగో!

ఫోన్, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్ అన్నింటికీ ఒకే ఛార్జర్.. టాప్-5 వైర్‌లెస్ ఛార్జర్స్ లిస్ట్ ఇదిగో!
Advertisement

Best Wireless Chargers 2026: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లలో వైర్‌లెస్ ఛార్జింగ్ అనేది ఒక కామన్ ఫీచర్‌గా మారిపోయింది. అయితే ప్రతి డివైజ్‌కు విడివిడిగా కేబుల్స్ వాడటం వల్ల డెస్క్‌పై వైర్ల గందరగోళం ఎక్కువవుతుంది. ఈ సమస్యకు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ ఒక చక్కని పరిష్కారం. ఇవి కేబుల్స్ లొల్లి లేకుండా ఒకేచోట డివైజ్‌లను ఈజీగా ఛార్జ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ వైర్‌లెస్ ఛార్జర్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

స్పిగెన్ మ్యాగ్‌సేఫ్ ఛార్జర్:

Spigen PF2402 మోడల్ లేటెస్ట్ Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది స్మార్ట్‌ఫోన్‌లకు 15W స్పీడ్‌తో ఛార్జ్ అందిస్తుంది. దీనిలో ఉండే మ్యాగ్నెటిక్ అలైన్‌మెంట్ వల్ల ఫోన్ కరెక్ట్ ప్లేస్‌లో కూర్చుని, ఎలాంటి బ్రేక్స్ లేకుండా ఛార్జ్ అవుతుంది. మ్యాగ్‌సేఫ్ సపోర్ట్ చేసే ఐఫోన్‌లతో పాటు ఆండ్రాయిడ్ ఫోన్లకు కూడా ఇది పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. ఆఫీస్ డెస్క్ లేదా బెడ్‌రూమ్ టేబుల్‌పై పెట్టుకోవడానికి ఇది చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది.

ఆంబ్రేన్ త్రియో ప్యాడ్:

Advertisement

యాపిల్ డివైజ్‌లు ఎక్కువగా వాడేవారికి Ambrane Aerosynq Trio 2 బెస్ట్ ఆప్షన్. ఇది ఐఫోన్, యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్‌ను ఒకేసారి ఛార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీని మొత్తం అవుట్‌పుట్ 22.5W కాగా, స్మార్ట్‌ఫోన్ కోసం 15W స్పీడ్‌ను ఇస్తుంది. మూడు డివైజ్‌ల కోసం వేర్వేరు ఛార్జర్లు వాడే అవసరం లేకుండా, డెస్క్‌ను నీట్‌గా ఉంచుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది.

Also Read: గుట్టు చప్పుడు కాకుండా లీకైన గూగుల్ కొత్త అప్‌డేట్.. ఆ 3 వాచ్‌లు ఉన్నవారికి లక్కే!

జెబ్రోనిక్స్ బ్లాక్ ఛార్జర్:

Advertisement

తక్కువ బడ్జెట్‌లో మంచి వైర్‌లెస్ ఛార్జర్ కావాలనుకునే వారికి Zebronics ZEB-MAGBOOST 20 బాగా సెట్ అవుతుంది. ఇది తక్కువ ధరలోనే మ్యాగ్నెటిక్ అలైన్‌మెంట్ ఫీచర్‌ను అందిస్తుంది. ఫోన్ కదలకుండా ఛార్జ్ అవ్వడానికి ఇది సాయపడుతుంది. ఇందులో ఓవర్‌కరెంట్, వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుంచి డివైజ్‌లను కాపాడే సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. నార్మల్ వైర్ ఛార్జింగ్ నుంచి వైర్‌లెస్‌లోకి మారాలని చూసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.

యాపిల్ అఫీషియల్ ఛార్జర్:

ఐఫోన్ యూజర్లకు అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ అనుభవాన్ని ఇవ్వడానికి Apple MGDM4ZM/A ప్యాడ్ ఉపయోగపడుతుంది. సరైన అడాప్టర్‌తో కనెక్ట్ చేసినప్పుడు ఇది ఏకంగా 25W వైర్‌లెస్ ఛార్జింగ్ స్పీడ్‌ను అందిస్తుంది. పాత మ్యాగ్‌సేఫ్, Qi మోడల్స్‌కు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. యాపిల్ సొంత ప్రొడక్ట్ కావడం వల్ల ఐఫోన్‌తో దీని కనెక్టివిటీ, పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి.

జెబ్రోనిక్స్ వైట్ ఛార్జర్:

Zebronics ZEB-MAGBOOST 20 మోడల్ ఫీచర్ల పరంగా బ్లాక్ కలర్ వేరియంట్ లాంటిదే అయినప్పటికీ, క్లాసిక్ వైట్ లుక్ ఇష్టపడేవారి కోసం డిజైన్ చేశారు. ఫోన్ వైబ్రేట్ అయినా లేదా నోటిఫికేషన్లు వచ్చినా పడిపోకుండా మ్యాగ్నెట్స్ గట్టిగా పట్టి ఉంచుతాయి. ఓవర్‌హీటింగ్, షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉండేలా ఇందులో రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. తక్కువ ధరలో డెస్క్‌కు మంచి లుక్ ఇవ్వడానికి ఇది బాగుంటుంది.

Also Read: ఫోన్ వెనుక లైటింగ్ ఎఫెక్ట్స్.. 8000mAh బ్యాటరీ.. Tecno Pova 8 5G ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు!

Tags

Related News

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

Big Stories

Advertisement
×