Peddapali Crime News: పుట్టిన పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకుంటుంది తల్లి. పిల్లల విషయంలో ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోరు. అలాంటిది కన్న తల్లి, రెండేళ్లు కూతుర్ని చంపేసింది. ఆపై ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆమెకి ఎలాంటి ఫ్యామిలీ సమస్యలు లేవు. కాకపోతే ఒక్కటే కారణం. అదేంటి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.
ఏం జరిగింది?
పైన కనిపిస్తున్న మహిళ పేరు సాహితి. వయస్సు 29 ఏళ్లు. ఆమెకు రెండేళ్లు పాప కూడా ఉంది. ఆమెకు నాలుగేళ్ల కిందట పెళ్లి జరిగింది. ఆమె భర్త వేణుగోపాల్‌రెడ్డి ఎల్ఐసీ ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం వేణుగోపాల్ ఫ్యామిలీ అంతా పెద్దపల్లిలోని టీచర్స్ కాలనీలో ఉంటున్నారు. భార్యాభర్తలు చిన్నారితో ఎంతో హాయిగా ఉండేవారు. సమస్యలు ఏమైనా వచ్చినా షేర్ చేసుకుంది సాహితి.
రెండురోజుల కిందట బాసర వెళ్లారు సాహితి-వేణుగోపాల్ దంపతులు. చిన్నారికి సరస్వతి దేవి ఆలయంలో అక్షరాభ్యాసం చేయించారు. బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఏం జరిగిందో తెలీదు. సాహితి మనసులోని ఏమి ఆలోచన వచ్చిందో తెలీదు. లాలించిన చేతులతో కూతుర్ని చంపేసింది. ఆపై తను కూడా ఉరేసుకుంది.
అదేరోజు రాత్రి సాహితికి ఆమె పేరెంట్స్ ఫోన్ చేశారు. ఎంతకీ లిప్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చింది. ఈలోగా ఇరుగుపొరుగువారితో మాట్లాడారు. వారి వచ్చి చూడడంతో ఆత్మహత్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎంటెక్ చదివిన సాహితి, కాసింత సన్నగా ఉండేది. తాను సన్నగా ఉన్నానంటూ బాధపడేది, ఆపై ఎక్కువగా ఆలోచించేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
ALSO READ: బోస్టన్ వ్యభిచార స్కామ్, భారత సంతతి సీఈవో అరెస్ట్
లేఖలో ఏముంది?
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇంట్లో పరిసరాలను గమనించారు. ఈలోగా ఓ లేఖ లభించింది. తన భర్త మంచివాడని పేర్కొంది. తన చావుకు ఎవరు బాధ పడొద్దని, తాను లేకుండా చిన్నారి ఎలా ఉంటుందోనన్న ఆవేదనతో వెంట తీసుకెళ్తున్నానని ప్రస్తావించింది.
దీంతో సాహితి గురించి వివరాలు తీయడం మొదలుపెట్టారు పోలీసులు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. బయటకు వెళ్లిన భర్త ఆలస్యంగా ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో తాను లేకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని కన్నీరుమున్నీరు అయ్యారు.