BigTV English
Advertisement

Star Heroine : చేతినిండా సినిమాలు పెట్టుకోవడం కాదు.. ఒక్క హిట్ అయినా కొట్టాలి మేడం

Star Heroine : చేతినిండా సినిమాలు పెట్టుకోవడం కాదు.. ఒక్క హిట్ అయినా కొట్టాలి మేడం

Star Heroine : టాలీవుడ్ ను షేక్ చేస్తూ వరుసగా సినిమాలు చేస్తున్న హీరోయిన్ శ్రీలీల. తెలుగు ఇండస్ట్రీలోనే కాక కన్నడంలో కూడా అడుగుపెట్టిన శ్రీలీల పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. శ్రీకాంత్ కొడుకు రోషన్ ను  ఈ సినిమాతో హీరోగా పరిచయం చేశారు రాఘవేంద్రరావు. ఆ సినిమా ప్లాప్ అయినా కూడా ఆ సినిమాలోపాటలలో  గ్లామర్ ని చూపించడంతో ఆమెకు ఆఫర్లు వచ్చాయి. తరువాత రవితేజ ధమాకా సినిమాలో నటించి మెప్పించింది. ఆ తరువాత వరుసగా సినిమాలు తీసినా ఏ సినిమా అనుకున్నంత స్థాయిలో హిట్ కాలేదు. ఇప్పుడు ఈ అమ్మడు మంచి హిట్ కోసం ఎదురుచూస్తుంది. శ్రీలీలను నిరాశపరిచిన సినిమాలేంటి? అమ్మడు చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాలు ఏంటి? ఆ వివరాలు చూద్దాం..


డాన్స్  వుంటే సరిపోదు ..

శ్రీలీల వరుసగా సినిమాలైతే చేస్తున్నారు కానీ, ఎందుకు చేస్తున్నారో ఆమె కూడా అర్థం కావట్లేదు. అసలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలియట్లేదు. సినిమాలు ప్లాప్ అయినా అమ్మడి గ్లామర్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ధమాకా సినిమా చేసిన తర్వాత అమ్మడికి మంచి అవకాశాలే వచ్చాయి. ఆ సినిమాలో శ్రీలీల డాన్స్ తో ఒక ఊపు ఊపేసిందనే చెప్పొచ్చు. రవితేజ కి పోటీగా ఎనర్జిటిక్ డాన్స్ చేసి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. ఎనర్జిటిక్ హీరో రామ్ తో స్కంద, ఆది కేశవ, మహేష్ తో గుంటూరు కారం, రీసెంట్ గా వచ్చిన రాబిన్ హుడ్, ఈ సినిమాలలో ఏ సినిమా శ్రీలీలకు మంచి గుర్తింపు తీసుకురాలేదు. డాన్సులపరంగా మెప్పించినా, అది ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కి వెళ్లడానికి సరిపోదు.


రానున్న సినిమాలు ..

ఇక శ్రీలీల చేసిన వాటిలో, చెప్పుకోదగిన హిట్ ఏమైనా అందుకుంది అంటే అది ‘గుంటూరు కారం’ సినిమా. ఆ తరువాత నందమూరి బాలకృష్ణ తో చేసిన ‘భగవత్ కేసరి’ సినిమాలనే చెప్పొచ్చు. ఇకపై గ్యాప్ లేకుండా ముందుకు వస్తాను అని, కం బ్యాక్ అంటూ ముందుకు వస్తుంది అమ్మడు. శ్రీలీల అక్కినేని అఖిల్ తో లెనిన్, రవితేజ తో మాస్ జాతర, పవన్ తో ఉస్తాద్, నాగచైతన్య తో ఒక సినిమా, శివ కార్తీకేయ తో పరాశక్తి, కార్తీక్ ఆర్యన్ సినిమాలలో నటిస్తున్నారు. వీటిలో ఏ సినిమా, కంబ్యాక్ఇస్తుందో అని, అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కంటెంట్ పై ఫోకస్ పెట్టమ్మా గ్యాప్ వచ్చిన పర్వాలేదు అని అంటున్నారు అభిమానులు.

About read: Vaishnavi: No.1 ఖతర్నాక్, చీరలో చూసి మోసపోకండి.. వైష్ణవిపై సిద్దు కామెంట్స్.. వీడియో వైరల్

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×