Anurag Bajpayee: అమెరికాలో భారత సంతతి సీఈఓ అనురాగ్ బాజ్‌పాయ్ అరెస్టయ్యారు. వ్యభిచార గృహాలతో ఆయనకు సంబంధాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన్ని అరెస్ట్ చేసినట్టు న్యూయార్క్ పోస్ట్ ఓ కథనాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఆయన క్లీన్ వాటర్ స్టార్టప్ గ్రేడియంట్ సీఈఓ ఉన్నారు.
వ్యభిచార గృహాల్లో గడిపి ఎక్కువ మొత్తంలో చెల్లించిన వ్యక్తుల జాబితాలో ఆయన పేరు ఉంది. డాక్టర్లు, అడ్వకేట్లు, ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్లకు చెందిన గ్రూప్‌లో అనురాగ్ పేరు ఉంది. ఈ విషయాన్ని విచారణ అధికారులు తెలిపారు. గంటకు 600 డాలర్లు చెల్లిస్తున్నారని చెప్పుకొచ్చింది. ఎంచుకునేవారు ఎక్కువగా ఆసియా మహిళలు ఉంటారని వెల్లడించింది.
వారంతా మానవ అక్రమరవాణా కారణంగా ఈ ఊబిలో చిక్కుకున్నట్లు తెలిపింది. ఈ కుంభకోణంలో తమ బాస్ పేరు ఉండటంతో గ్రేడియంట్ సంస్థ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.అనురాగ్ పని చేసే సంస్థ ఆయనకు మద్దతు ప్రకటించింది. న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని వ్యక్తం చేసింది కూడా. ఈ సంస్థ విలువ ఒక బిలియన్ డాలర్లకు పైగా ఉంది.
హార్వర్డ్ విశ్వవిద్యాలయం సమీపంలోని ఖరీదైన అపార్ట్‌మెంట్లలో వ్యభిచార గృహానికి వేదికైంది. ఎగ్జిక్యూటివ్స్, డాక్టర్లు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు వస్తుంటారు. అక్కడ భారీ మొత్తంలో డబ్బులు చెల్లించి ఏకాంతంగా గడుపుతారు. అక్కడికి వచ్చినవారు గుర్తింపు కార్డులు, వ్యక్తిగత వివరాలను సమర్పిస్తారని ఆ పత్రిక రాసుకొచ్చింది.
ALSO READ: వారంలో కూతురు పెళ్లి, కాబోయే అల్లుడితో లేచిపోయిన అత్త
ఈ వ్యభిచార గృహం దగ్గర ఉన్న రికార్డులు ఆధారంగా విచారణ చేస్తున్నారు అధికారులు. దాదాపు 30 మందికి పైగా ఉన్నత వ్యక్తులు ఏకాంతం కోసం వచ్చి డబ్బులు చెల్లించారని తేలింది. వారిలో గ్రాడియంట్ వ్యర్థ జల శుద్ధి సంస్థ సీఈఓ అనురాగ్ బాజ్‌పాయ్ కూడా ఒకరు. అలాగే కేంబ్రిడ్జ్ నగర కౌన్సిలర్, ప్రభుత్వ అధికారి పేరు ఉన్నట్లు తెలుస్తోంది.
గడిచిన నెలరోజులుగా కొందర్ని అరెస్టు చేశారట అక్కడి అధికారులు. ఈ కేసుకు సంబంధించి విచారణలో లోతుగా సాగుతోంది. ఈ కుంభకోణంలో ప్రభావవంతమైన వ్యక్తుల జవాబుదారీ తనం, నాయకత్వం గురించి ఓ వైపు విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.
అనురాగ్ ఎవరు?
అనురాగ్ బాజ్‌పేయి క్లీన్ టెక్ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి. అధునాతన నీరు, మురుగు నీటి శుద్ధి పరిష్కారాలలో గుర్తింపు పొందిన వ్యక్తిగా పేరు సంపాదించారు. గ్రాడియంట్ క్లీన్ టెక్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో కూడా. ఈ సంస్థ ఎక్కువ సౌకర్యాలతో 25 దేశాలలో పని చేస్తోంది.
బాజ్‌పేయి అమెరికాలోని ఎంఐటీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డాక్టరేట్ పట్టా పొందారు. పారిశ్రామిక డీశాలినేషన్, నీటి శుద్ధి సాంకేతికతలలో తన అద్భుతమైన కృషికి గుర్తింపు పొందారు. లక్నోలోని లా మార్టినియర్ కళాశాలలో పాఠశాల విద్యను అభ్యసించాడు.