BigTV English

MP Crime: ల‌వ‌ర్‌ని చంపి డెడ్‌బాడీతో 2 రోజులు.. ఏం జ‌రిగిందంటే

MP Crime: ల‌వ‌ర్‌ని చంపి డెడ్‌బాడీతో 2 రోజులు.. ఏం జ‌రిగిందంటే

MP Crime: అతడు నిరుద్యోగి.. ఆమె ఒక వర్కింగ్ ఉమెన్.. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం.. గడిచిన మూడేళ్లుగా లివింగ్ రిలేషన్ షిప్‌లో కొనసాగిస్తున్నారు. ఉన్నపళంగా ఇద్దరి మధ్య గొడవలు. కట్ చేస్తే ప్రేయసి ప్రాణాలు తీశాడు ప్రియుడు. చనిపోయిన ప్రియురాలి శవం పక్కనే రెండు రోజులుపాటు పడుకున్నాడు. అసలు తన లవర్‌ని చంపడానికి కారణం ఏంటి? సఖ్యతగా ఉన్న ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.


మధ్యప్రదేశ్ భూపాల్‌ లోని గాయత్రి నగర్‌లో రితికా, సచిన్ రాజ్‌పుత్‌లు కలిసి జీవిస్తున్నారు. వీరద్దరికి పెళ్లి కానప్పటికీ సహజీవనం చేస్తున్నారు. రితికా భూపాల్‌లోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుంది. సచిన్‌కు ఏ పనీ లేదు. రితికా సంపాదనతో ఇంట్లో ఉండి జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రితికాపై అసూయ పెంచుకున్నాడు. తనకు ఎంతకు ఉద్యోగం రాకపోవడంతో కలత చెందిన సచిన్.. రితికపై కోపం పెంచుకున్నాడు. అంతేకాకండా రితికకు తన కంపెనీలో సీనియర్ ఉద్యోగితో సంబంధం ఉందని.. లేని అఫైర్‌ను అంటగట్టాడు. రితికపై అనుమానం పెంచుకుని ఆమెతో వాగ్వాదానికి దిగాడు. సహనం కోల్పోయిన రితికా సచిన్ రాజ్‌పుత్‌తో గొడవకు దిగింది. తనకు ఆఫీస్‌లో ఎలాంటి అఫైర్ లేదని తేల్చి చెప్పింది. ఇలా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. అసలే ఉద్యోగంలేని డిప్రెషన్ లో ఉన్న సచిన్ రితికా మాటలకు ఆగ్రహానికి గురయ్యాడు.

రితికా గొంతు నులిమి చంపేశాడు. రితికా చనిపోయిందని భావించిన సచిన్ ఏం చేయాలో తోచక.. శవాన్ని బెడ్ షీట్‌లో చుట్టి మంచంపై పడుకోబెట్టాడు. ఇలా రెండు రోజులపాటు అదే గదిలో ఉంటూ తాగి రితిక శవం పక్కనే నిద్రపోయాడు. మద్యం మత్తులో ఉన్న సచిన్.. ఆదివారం స్నేహితుడు అనూజ్‌కు ఫోన్ చేశాడు. అర్జెంట్‌గా ఇంటికి రమ్మని పిలిచాడు. జరిగిన విషయమంతా తన ఫ్రెండ్ అనూజ్‌కు వివరించాడు. ఈ విషయాన్ని సోమవారం సాయంత్రం పోలీసులకు తెలిపాడు అనూజ్. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రితికా ఉన్న ఇంటికి వెళ్లి చూశారు. ఆమె దుప్పటిలో చుట్టబడి మంచంపై శవంగా ఉండటాన్ని గమనించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. సచిన్‌పై మర్డర్ కేసు నమోదు చేసుకుని ఇన్వస్టిగేషన్ స్టార్ట్ చేశారు పోలీసులు.


Also Read: ప్రియురాలి కోసం భార్యని ఎలా ప్లాన్ చేసి చంపాడంటే..

అయితే ఇక్కడ ఇదే క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సచిన్‌కు గతంలోనే వేరే మహిళతో వివాహం అయిందని.. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని వెల్లడించారు. సచిన్ తన భార్య పిల్లలను వదిలి తొమ్మిది నెలలుగా.. గాయత్రి నగర్‌లోని రితికా ఉండే ఇంట్లో ఉంటున్నట్టూ పోలీసులు తెలిపారు. జాబ్ ప్రస్టేషన్ నుంచి డిప్రెషన్‌కు గురై హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. హత్య చేసిన తర్వాత భయపడి మద్యం సేవిస్తూ.. రితికా శవం పక్కనే ఉండిపోయాడని దర్యాప్తులో తేలింది. క్షణికావేశంలో సచిన్ చేసిన తప్పుకు అతని కుటుంబం, పిల్లలు అన్యాయానికి గురయ్యారు. అలాగే రితికా అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో పెను సంచలనంగా మారింది.

Related News

UP News: రాఖీ కట్టించుకుని మరీ బాలికపై అఘాయిత్యం.. ఆ తర్వాత ఫ్యాన్‌కు వేలాడ దీసి..?

Bengaluru Crime: వారిద్దరూ 30 ఏళ్లుగా ప్రాణ స్నేహితులు.. పదేళ్లుగా ఫ్రెండ్ భార్యతో ఎఫైర్, చివరికి ప్రాణం తీశారు!

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. వ్యాన్- కంటైనర్ ఢీ.. స్పాట్‌‌లో 10 మంది మృతి, ఇంకా

Delhi crime news: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. స్విమ్మింగ్ పూల్ వెళ్లిన బాలికలపై అత్యాచారం!

Loan app scam: రూపాయి లోన్ లేదు కానీ.. రూ.15 లక్షలు చెల్లించిన యువతి.. షాకింగ్ స్టోరీ!

Karnataka Crime: దారుణం.. అత్తను 19 ముక్కలుగా నరికి 19 చోట్ల పడేసిన అల్లుడు

Big Stories

×