Kuberaa 2: డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం కుబేర(Kuberaa). కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Danush) రష్మిక (Rashmika) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కూడా భాగమైన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా జూన్ 20వ తేదీ తెలుగు తమిళ హిందీ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే తమిళంతో పోలిస్తే హిందీ తెలుగు భాషలోనే ఈ సినిమాకు మంచి ఆదరణ లభించిందని చెప్పాలి. ఇకపోతే ఇటీవల కాలంలో ఒక సినిమా హిట్ అయితే కచ్చితంగా ఆ సినిమాకు సీక్వెల్ సినిమా అనేది ఉంటుంది. ఈ క్రమంలోనే కుబేర సినిమాకు కూడా సీక్వెల్ ఉంటుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ధనుష్ కు షాక్ ఇచ్చిన తమిళ ప్రేక్షకులు..
కుబేర సినిమాకు సీక్వెల్ ఉంటుందని, అయితే ఆ సినిమాలో హీరోగా ధనుష్ నటించిన లేదు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. కుబేర సినిమా సీక్వెల్ గురించి ఇప్పటివరకు డైరెక్టర్ ఎక్కడ అధికారకంగా ప్రకటించకపోయిన ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది. కుబేర సీక్వెల్ సినిమాలో ధనుష్ కాకుండా టాలీవుడ్ హీరోకి అవకాశం ఇవ్వబోతున్నారని సమాచారం. మరి ఈ సినిమా సీక్వెల్ లో ఛాన్స్ అందుకోబోతున్న ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు నటుడు అల్లరి నరేష్ (Allari Naresh)అంటూ ఒక వార్త బయటకు వచ్చింది.
బెగ్గర్ పాత్రలో అల్లరి నరేష్…
కుబేర సినిమాలో ధనుష్ ఒక బెగ్గర్ (Begger) పాత్రలో నటించిన విషయం తెలిసిందే.. ఈ పాత్రలో ఈయన పరకాయ ప్రవేశం చేస్తూ ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. అయితే కుబేర సినిమాలో ధనుష్ పాత్ర బయటకు వచ్చిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లరి నరేష్ బెగ్గర్ పాత్రలో నటించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది ఈ వీడియో ద్వారా అల్లరి నరేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. అల్లరి నరేష్ పెళ్లయింది కానీ (pellaindi kaani)సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఒక సన్నివేషంలో ఈయన బెగ్గర్ పాత్రలో అదరగొట్టారు.
తెలుగు హీరోలను పక్కనపెట్టిన దర్శకులు..
కుబేర సినిమా సమయంలో అల్లరి నరేష్ కి సంబంధించిన వీడియోని వైరల్ చేస్తూ ధనుష్ కంటే కూడా అల్లరి నరేష్ చాలా అద్భుతంగా నటించారు అంటూ ఈయన నటనపై ప్రశంసలు వచ్చాయి. దీంతో కుబేర 2(Kuberaa 2) చేస్తే కనుక కచ్చితంగా అందులో హీరోగా అల్లరి నరేష్ అయితే అద్భుతంగా ఉంటారని, తనని తీసుకొని ఆలోచనలో ఉన్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇలా అల్లరి నరేష్ ఈ సినిమాలో భాగం కాబోతున్నారని విషయం తెలియడంతో కొంతమంది విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఇటీవల కాలంలో తెలుగు దర్శకులు తెలుగు హీరోలను పక్కనపెట్టి పూర్తిగా తమిళ హీరోలతో సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. ఇక కుబేర సినిమాకు తమిళంలో గట్టి షాక్ తగలడంతో సీక్వెల్ లో నరేష్ ను తీసుకోవాలనే ఆలోచన చేయటంతో ఈ తెలుగు హీరో విలువ ఇప్పుడు తెలిసిందా? అంటూ పలువురు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: తూచ్.. అదంతా అబద్ధం.. పుకార్లను ఖండించిన హిట్ భామా?