E-Paper
Advertisement

Madhya Pradesh: నిశ్చితార్థానికి ముందు.. వరుడి తల్లితో వధువు తండ్రి జంప్

Madhya Pradesh: నిశ్చితార్థానికి ముందు.. వరుడి తల్లితో వధువు తండ్రి జంప్
Advertisement

Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కూతురి నిశ్చితార్థానికి ముందు, ఆమెకు కాబోయే అత్త గారితో పరారయ్యాడు తండ్రి. మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తప్పిపోయిన మహిళను గురువారం పోలీసులు కనుగొన్నారు. ఉంట్వాసా గ్రామానికి చెందిన 45 ఏళ్ల మహిళ వారం రోజుల నుంచి కనిపించడంలేదని ఆమె కుమారుడు పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నిశ్చితార్థానికి ముందు

గురువారం ఆమెను చిక్లి గ్రామంలో మహిళలను కనుగొన్నారు. ఆమె 50 ఏళ్ల వ్యక్తితో ఇంట్లోంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. అతడు… ఆమె కొడుకుకు కాబోయే భార్యకు తండ్రి అని తెలిసింది. చిక్లికి చెందిన ఓ వ్యక్తి భార్య ఇటీవల మృతి చెందింది. అతడు తన ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నాడు. తన కుమార్తెకు ఇటీవల ఓ మహిళ కొడుకుతో నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించారు.

Advertisement

నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో, కాబోయే అత్త, మామలు ఇద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకున్నారు. వీరిద్దరూ ఇంట్లోంచి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఘటన రెండు కుటుంబాలను షాక్‌కు గురిచేసింది.

వరుడి తల్లితో వధువు తండ్రి జంప్

“ఎనిమిది రోజుల క్రితం 45 ఏళ్ల మహిళ కనిపించడం లేదని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆమె తన భర్త, 18, 20 ఏళ్ల ఇద్దరు పిల్లలను వదిలి 50 ఏళ్ల మరో వ్యక్తితో వెళ్లిపోయింది. అతడి కూతురితో ఆ మహిళ కొడుకు నిశ్చితార్థం చేసుకోవలసి ఉంది. వధువు తండ్రి, వరుడి తల్లి ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకుని ఇంట్లో పరారయ్యారు” అని పోలీస్ అధికారి చెప్పారు.

Advertisement

Also Read: Bengaluru Crime: అంబులెన్స్ బీభత్సం.. ముగ్గురు మృతి, వాహనాన్ని ఎత్తి పడేసిన స్థానికులు, వీడియో వైరల్

అయితే ఆ మహిళ తన ప్రేమికుడిని విడిచిపెట్టడానికి నిరాకరిస్తుంది. అతనితోనే ఉండాలని కోరుకుంటున్నట్లు చెబుతోంది. కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తిరిగి రమ్మని కోరినా ఫలితం లేకపోయింది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×