Bengaluru Crime: ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ బీభత్సం సృష్టించింది. ఫలితంగా ముగ్గురు ప్రాణాలను బలికొంది. ఆగ్రహానికి గురైన స్థానికులు, అంబులెన్సుని ఎత్తి పడేశారు. సంచలనం రేపిన ఈ ఘటన బెంగళూరు సిటీలోని రిచ్‌మండ్ సర్కిల్ వద్ద జరిగింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగింది?
బెంగుళూరు అంబులెన్స్ బీభత్సం
బెంగళూరులో శనివారం రాత్రి విషాదకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్లి ప్రాణాలను కాపాడాల్సిన అంబులెన్స్.. ముగ్గుర్ని బలిగొంది. ఫలితంగా సిగ్నల్ వద్ద ఆగి ఉన్న బైక్‌లను ఢీ కొట్టింది. స్పాట్‌లో ముగ్గురు చనిపోయారు. వారిలో దంపతులు కూడా ఉన్నారు. ప్రమాదానికి గురైన బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు అంబులెన్స్‌ను ఎత్తి పడేశారు.
బెంగుళూరులో శనివారం రాత్రి 11 గంటల సమయంలో శాంతినగర్ బస్టాండ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. వేగంగా వస్తున్న అంబులెన్స్, డ్రైవర్ సడన్‌గా నియంత్రణ కోల్పోయాడు. ఫలితంగా రెడ్ సిగ్నల్ వద్ద ఆగి బైక్ రైడర్లపైకి అంబులెన్స్ దూసుకెళ్లింది. రెండు బైకులను ఢీ కొట్టింది. స్పాట్‌లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
సిగ్నల్ వద్ద టూ వీలర్స్‌పైకి దూసుకెళ్లింది
ప్రమాదం తీవ్రంగా ఏ స్థాయిలో ఉందంటే.. అంబులెన్స్ దాదాపు 50 మీటర్ల దూరం ఆ బైక్‌లను ఈడ్చుకుంటూ వెళ్లింది. సమీపంలోని పోలీస్ అవుట్‌పోస్ట్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో ట్రాఫిక్ నిలిచి పోయింది. ఆ ప్రమాదాన్ని చూసిన వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు.
రెడ్ లైట్ సిగ్నల్ పడినా పట్టించుకోకుండా అంబులెన్స్ దూసుకెళ్లినట్టు ప్రత్యక్షసాక్షలు చెబుతున్నారు. ప్రమాదం సమయంలో అంబులెన్స్.. రిచ్మండ్ సర్కిల్ నుండి అధిక వేగంతో వస్తోందని తెలిపారు. సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడడంతో అనేక మంది బైకర్లు ఆగారు. సెకన్ల వ్యవధిలో అంబులెన్స్ వారిపైకి దూసుకెళ్లింది, రోడ్డు వెంట మూడు బైక్‌లను ఈడ్చు కెళ్లి చివరికి ఆగిపోయింది.
ALSO READ: వద్దు డాడీ అన్నా వినలేదు.. నాకళ్ల ముందే నరికేశాడు
బాధితులకు సహాయం కోసం స్థానికులు పరుగెత్తారు. అప్పటికే 40 ఏళ్ల ఇస్మాయిల్, ఆయన భార్య సమీన్ బాను, మరొక వ్యక్తి మృత్యువాతపడ్డారు. ఆవేశంలో స్థానికులు అంబులెన్సుని ఎత్తి పడేశారు. అప్పటిగానీ వారి కోపం తగ్గలేదు. దీనివల్ల ఆ ప్రాంతంలో దాదాపు రెండుగంటలపాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే విల్సన్ గార్డెన్ ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అంబులెన్స్ నియంత్రణ కోల్పోవడానికి ఆధారాలు సేకరించే ప్రయత్నంలో పడ్డారు. ప్రమాదం తర్వాత స్థానికులు అంబులెన్స్‌ని ఎత్తి పడేసిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అంబులెన్స్ బీభత్సం.. ఎత్తిపడేసిన స్థానికులు..
బెంగళూరు రిచ్మండ్ సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం
సిగ్నల్ వద్ద ఆగి ఉన్న బైక్‌లను ఢీ కొట్టిన అంబులెన్స్
ఘటనా స్థలంలోనే ఇస్మాయిల్, సమీన్ బాను దంపతులు మృతి
ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
ఆగ్రహంతో అంబులెన్స్ ను… pic.twitter.com/yW8XCASxsX
— BIG TV Breaking News (@bigtvtelugu) November 2, 2025