Buddha Venkanna: కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన జోగి రమేష్ పై హాట్ కామెంట్స్ చేశారు బుద్దా వెంకన్న. తప్పులు చేయడం, సమర్థించుకోవడం వైసీపీ DNA లో ఉందన్నారు. అమ్మవారి గుడికి వెళ్లి దొంగ ప్రమాణం చేశాడు.. అందుకే అమ్మవారు కన్నెర్ర చేశారు. ప్రమాణం చేయకుండా ఉంటే రెండు, మూడు రోజులు బయట ఉండేవాడేమో అంటూ కామెంట్ చేశారు. జగన్ డైవర్షన్ రాజకీయాలు చేయడం అలవాటన్నారు. ఇంకా ఓవర్ చేస్తే.. నకిలీ మద్యం బాధితులు తాడేపల్లి ప్యాలెస్ ఎదుట ధర్నా చేస్తారంటూ హెచ్చరించారు.