E-Paper
Advertisement

Mumbai Crime: యువతిపై సామూహిక అత్యాచారం.. 16 మంది డీఎన్ఏ పరిశీలన.. నిందితుల్లో తండ్రి సైతం..!

Mumbai Crime: యువతిపై సామూహిక అత్యాచారం.. 16 మంది డీఎన్ఏ పరిశీలన.. నిందితుల్లో తండ్రి సైతం..!
Advertisement

Mumbai Crime:  దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న 20 ఏళ్ల యువతిపై కొందరు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. 16 మంది డీఎన్ఏలను పరీక్షించగా కన్నతండ్రి (48) కూడా యువతిపై అత్యాచారం చేసినట్లు వెల్లడైంది. దీంతో ఒక్కసారిగా ఖంగు తిన్న ముంబయి పోలీసులు.. ఆ కసాయి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే..

పోలీసుల కథనం ప్రకారం.. 2025 అక్టోబర్ లో దక్షిణ మంబయిలోని కామా అండ్ ఆల్బ్లెస్ ఆసుపత్రి (Cama & Albless Hospital) నుంచి పోలీసులకు కాల్ వచ్చింది. తమ సంరక్షణలో ఉన్న 20 ఏళ్ల యువతికి కడుపునొప్పి రావడంతో పరీక్షలు చేశామని ఆమె 5 నెలల గర్భవతి అని తేలిందని పోలీసులకు తెలియజేశారు. ఆమె మానసిక రుగ్మతను అసరాగా చేసుకోని ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

16 మంది డీఎన్ఏ సేకరణ..

Advertisement

కామా అండ్ ఆల్బ్లెస్ ఆసుపత్రి ఫిర్యాదు ఆధారంగా ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత యువతి మాట్లాడలేని స్థితిలో ఉండటంతో.. ఆమె తండ్రి సహా ఇతర కుటుంబ సభ్యులు, యువతిని నేరుగా కలవడానికి అవకాశమున్న దాదాపు 16 మంది వ్యక్తుల నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించారు. అయితే అప్పటికే వైద్యుల సూచన మేరకు బాలికకు అబార్షన్ చేసి.. ఆమె శరీరం నుంచి తొలగించిన పిండంతో వారి డీఎన్ఏ మ్యాచ్ అవుతుందా? లేదా? అని పరిశీలించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ (Kalina Forensic Science Laboratory)కు పంపారు.

మరో ఇద్దరు అరెస్టు..

బాధితురాలి పిండం నుంచి సేకరించిన డీఎన్ఏ.. ఆమె తండ్రి డీఎన్ఏతో సరిపోయినట్లు ఫోరెన్సిక్ నిపుణులు ధ్రువీకరించారు. దీంతో యువతి తండ్రిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన మరో 16 ఏళ్ల కుర్రాడితో పాటు 32 ఏళ్ల వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి ముఖాలను చూసి బాలిక గుర్తించడంతో చార్జిషీట్ లో వారి పేర్లను చేర్చినట్లు స్పష్టం చేశారు.

Advertisement

Also Read: 6-6-6 Walking Trend: వైరల్ అవుతున్న 6-6-6 వాకింగ్ ట్రెండ్.. ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

బాధితురాలికి బెదిరింపులు

బాధిత యువతికి కౌన్సిలింగ్ ఇచ్చిన సమయంలో తొలుత ఇద్దరు నిందితుల ఫొటోలను గుర్తించినప్పటికీ.. తన తండ్రి విషయాన్ని మాత్రం బాధితురాలు దాచిపెట్టిందని దర్యాప్తు అధికారిని అశ్విని పాటిల్ తెలిపారు. సున్నితమైన పద్దతిలో తేలికపాటి ప్రశ్నలతో తండ్రి చేసిన దారుణాన్ని బాధితురాలి నుంచి వాంగ్మూలం రూపంలో సేకరించగలిగినట్లు ఆమె చెప్పారు. అయితే అత్యాచారం అనంతరం ఈ విషయం ఎవరితోనూ చెప్పవద్దని యువతిని నిందితులు బెదిరించినట్లు అధికారిణి చెప్పుకొచ్చారు.

Also Read: Bengaluru Crime: దొంగతనం చేస్తూ చిక్కిన దొంగ.. కుమ్మేసిన ఇంటివాసులు, పోలీసులకు దొంగ ఫిర్యాదు

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×