E-Paper
Advertisement

NCRB Report : మహిళలపై నేరాలు.. NCRB రిపోర్ట్ లో సంచలన వివరాలు..

NCRB Report : మహిళలపై నేరాలు.. NCRB రిపోర్ట్ లో సంచలన వివరాలు..
Advertisement

NCRB Report : మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో వెల్లడించింది. 2022లో 4 శాతం మేర పెరిగాయని తెలిపింది. భర్త లేదా అతడి బంధువుల క్రూరత్వమే మహిళలపై నేరాలలో అధికమని పేర్కొంది. ఆదివారం విడుదల చేసిన నివేదికలో పిల్లలపై నేరాలు అధికమవుతున్నాయని 2021 సంవత్సరంతో పోల్చితే 2022లో నేరాల సంఖ్య ఏకంగా 8.7 శాతం పెరిగిందని వివరించింది.

దేశవ్యాప్తంగా 2022 ఏడాదిలో 58,24,946 కేసులు నమోదయ్యాయని NCRB రిపోర్ట్ పేర్కొంది . 2021 ఏడాదితో పోల్చితే 4.5 శాతం పెరిగిందని వెల్లడించింది. ఐపీసీ విభాగంలో 35,61,379 నేరాలు నమోదయ్యాయని ప్రత్యేక, స్థానిక చట్టాల కింద నమోదైన కేసుల సంఖ్య భారీగా పెరిగాయని తెలిపింది.

Advertisement

మానవ శరీరాన్ని ప్రభావితం చేసే నేరాలు 5.3 శాతం , ఆర్థిక నేరాలు 11.1 శాతం, సైబర్ నేరాలు 24.4 శాతం,మానవ అక్రమ రవాణా నేరాలు 2.8 శాతం పెరిగాయని వెల్లడించింది. సీనియర్ సిటిజన్లు , షెడ్యూల్డ్ తెగల వ్యక్తులపై నేరాలు , హత్య కేసులు స్వల్పంగా తగ్గాయని NCRB వివరించింది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×