Vikarabad Murder Case: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. భార్య, కుమార్తె, వదినను వేపూరి యాదయ్య అనే వ్యక్తి కత్తితో.. నిద్రిస్తున్న ముగ్గురిని అతి కిరాతంగా నరికి చంపాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. వేపూరి యాదయ్య, ఆయన భార్య అలివేలు మద్య గత కొన్నాళ్లుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. శనివారం కూడా వారిద్దరు గొడవపడ్డారు. దీంతో వారికి సర్దిచెప్పడానికి అలివేలు సోదరి హనుమమ్మ ఇంటికి వచ్చింది. ఈ నేపథ్యంలో వారంతా రాత్రి గాఢ నిద్రలో ఉన్న సమయంలో వేటకొడవళ్ళతో భార్య అలివేలు, వదిన, చిన్న కూతురిని హత్య చేసాడు. అనంతరం దూలానికి ఉరి వేసుకొని యాదయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కూతురు అపర్ణ తప్పించుకుంది. అలివేలు అన్న నర్సింహ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు పోలీసులు.
వికారాబాద్ జిల్లా కులకచర్లలో తన తండ్రి చేతిలో హత్య నుంచి తప్పించుకున్న పెద్ద కూతురు అపర్ణ చెప్పిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. తనను, చెల్లిని చంపొద్దని ఎంత అరిచినా తండ్రి యాదయ్య వినలేదని ఆమె చెప్పింది. మిమల్ని ఎవరు చూసుకుంటారు.. అంటూ కొడవలితో అమ్మా, చెల్లి, పెద్దమ్మలను చంపేసాడని తెలిపింది. ఎప్పుడూ ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. మా అమ్మను బాగా కొడుతాడు.. ఎన్ని సార్లు చెప్పిన వినలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. శనివారం రాత్రి ఇంట్లో గొడవ జరిగింది. మా నాన్న యాదయ్య మొదట పెద్దమ్మ పై కొడవలితో దాడి చేసాడు. అడ్డు వచ్చిన అమ్మపై కూడా దాడి చేసాడు. నేను మా చెల్లి.. వద్దు డాడీ చంపొద్దు అని ఎంత అరిచినా వినలేదు. మిమల్ని ఎవరు చూసుకుంటారు అంటూ నా పై మా చెల్లిపై కూడా కొడవలి తో దాడి చేసాడని పేర్కొంది. నేను తపించుకొని బయటికి వచ్చాను. మా ఇంటి పక్కనే ఉండే ప్రభు అంకుల్‌ని పిలిచి వెళ్లే వరకు.. మా నాన్న కూడా ఆత్మహత్య చేసుకున్నాడని వివరించింది. మా నాన్న మాతో బాగానే ఉండేవాడు.. కానీ మా అమ్మను మంచిగా చూసుకోడు. ఇంతకు ముందు కూడా గొడవలు జరిగాయి. కొన్ని రోజులు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. మళ్ళీ ఇంటికి వచ్చాము అయినా మా నాన్న మారలేదు.. మా నాన్న ఇలా చేస్తాడు అనుకోలేదు అంటూ బాలిక ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read: ప్రిన్సిపాల్ వేధింపులు.. రోడ్డెక్కిన విద్యార్ధినులు
డాడీ వద్దు అన్నా వినలేదు.. నా కళ్ల ముందే నరికేశాడు: కూతురు అపర్ణ
వికారాబాద్ జిల్లా కులకచర్లలో తన తండ్రి చేతిలో హత్య నుంచి తప్పించుకున్న పెద్ద కూతురు అపర్ణ చెప్పిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. తనను, చెల్లిని చంపొద్దని ఎంత అరిచినా తండ్రి యాదయ్య వినలేదని ఆమె చెప్పింది. ‘‘డాడీ… https://t.co/qZdwJXlWQQ pic.twitter.com/c3HYXO0YWT
— ChotaNews App (@ChotaNewsApp) November 2, 2025