OTT Movie : సైకో కిల్లింగ్ స్టోరీలు ఇంటెన్స్ గా నడుస్తుంటాయి. హత్యలు, ఇన్వెస్టిగేషన్ లతో సీట్ ఎడ్జ్ థ్రిల్ కి తీసుకెళ్తుంటాయి. ఇలాంటి స్టోరీలు ఇప్పుడు ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ లో ఒక కిల్లర్ అమ్మాయిలను హత్యలు చేస్తూ, చెస్ట్ నట్ బొమ్మతో ఒక క్లూ ని కూడా వదులుతుంటాడు. క్లైమాక్స్ లో అసలు కిల్లర్ తెలిసి అంతా షాక్ అవుతారు. ఊహించని ట్విస్ట్లు , అదిరిపోయే థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ సిరీస్ ఉంటుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
‘చెస్ట్‌నట్ మ్యాన్’ (The chestnut man) అనేది డానిష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్‌ను డోర్టే వార్నో హాగ్, డేవిడ్ సాండ్రూటర్, మిక్కెల్ సెరప్ రూపొందించారు, దీనిని కాస్పర్ బార్ఫోడ్, మిక్కెల్ సెరప్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో డానికా కర్సిక్, మిక్కెల్ బో ఫోల్స్‌గార్డ్, నైయా తులిన్, మార్క్ హెస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2021 సెప్టెంబర్ 29న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.ఈ సిరీస్ రెండవ సీజన్ 2026లో ప్రీమియర్ కానుంది.
కోపెన్‌హేగెన్‌లో ఒక పార్కులో లారా అనే అమ్మాయి హత్యకి గురవుతుంది. కళ్లు పీకి, ఒక చేయి మొత్తం కట్ చేసి ఆ శవం భయంకరంగా ఉంటుంది. పక్కనే చిన్న చెస్ట్ నట్ బొమ్మ ఉంటుంది. అది కూడా చూడటానికి భయంకరంగా ఉంటుంది. డిటెక్టివ్ నాయా, మార్క్ ఈ కేస్ తీసుకుంటారు. ముందుగా బొమ్మపై ఫింగర్ ప్రింట్ ని తీసుకుంటారు. అది క్రిస్టీన్ అనే వ్యక్తిదని తెలుస్తుంది. క్రిస్టీన్ ఒక సంవత్సరం ముందు మిస్సింగ్ అవుతుంది. ఆమె చచ్చిపోయిందని అంతా అనుకున్నారు. ఇంతలో మరో మర్డర్ జరుగుతుంది. మళ్లీ ఒక ఆమ్మాయిని ఇదే స్టైల్ లో చంపి ఉంటారు. ఇలా మరిన్ని మర్డర్లు జరుగుతాయి.
Read Also : పొలిటీషియన్ అవతారమెత్తే గ్యాంగ్స్టర్… కట్ చేస్తే మెంటల్ మాస్ ట్విస్ట్… ఖతర్నాక్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్
ఇక ఈ ఇన్వెస్టిగేషన్ ఊహించని ట్విస్టులతో నడుస్తుంది. కిల్లర్ ఒక అమ్మాయి. కానీ హత్యలు ఎందుకు చేస్తోందనే విషయాలు సస్పెన్స్ గా సాగుతుంటాయి. అయితే ఒక ఊహించని ట్విస్ట్ వస్తుంది. కిల్లర్ అమ్మాయి కాదు, ఒక యువకుడు. క్రిస్టీన్ పై రివేంజ్ తీసుకోవడానికి చేస్తుంటాడు. ఈ ట్విస్ట్ తో ఆడియన్స్ కి కూడా ఫ్యూజులు అవుట్ అవుతాయి. చివరికి కిల్లర్ ఎందుకు రివేంజ్ తీర్చుకుంటున్నాడు ? అతని గతం ఏమిటి ? అమ్మాయిలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు ? అనే విషయాలను, ఈ థ్రిల్లర్ సిరీస్ ని చూసి తెలుసుకోవాల్సిందే.