OTT Movie : హారర్ అభిమానులకు థ్రిల్ ని ఇవ్వడానికి సరికొత్త సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. వీటిని చూస్తూ ఏంచెక్కా భయపడుతూ చిల్ అవుతున్నారు హారర్ సినిమా ప్రియులు. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా బెస్ట్ సజెషన్. ఈ కథ ఒక హైకింగ్ కి వెళ్ళిన నలుగురు ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతుంది. దట్టమైన అడవిలో వీళ్ళు ఒక మాన్స్టర్ చేతిలో చుక్కలు చూస్తారు. గుండెను ఉలిక్కిపడేలా చేసే సీన్స్ ఇందులో చాలానే ఉన్నాయి. హారర్ ఫ్యాన్స్ దీని పై కూడా ఓ లుక్ వేయండి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? దీని స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
“ది రిట్యువల్” (The Ritual) 2017లో విడుదలైన బ్రిటిష్ సూపర్ నాచురల్ హారర్ సినిమా. డైరెక్టర్ డేవిడ్ బ్రక్నర్ డైరెక్షన్‌లో రేఫ్ స్పాల్ (లూక్), ఆర్షర్ అలీ (రాహిల్), రాబర్ట్ జేమ్స్-కాలియర్ (డాం), సామ్ ట్రౌటన్ (ఫిల్), పాల్ రీడ్ (రాబ్) ప్రధాన పాత్రల్లో నటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా 2018లో స్ట్రీమింగ్ అయింది. 94 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 6.3/10 రేటింగ్ పొందింది.
లూక్, రాబ్ లండన్‌లో మంచి స్నేహితులుగా ఉంటారు. రాబ్ ఒక సూపర్ మార్కెట్ ని రన్ చేస్తుంటాడు. అందులో వీళ్లిద్దరూ ఉన్నప్పుడు, ఆ షాపులో రాబరీ చేయడానికి దొంగలు వస్తారు. రాబ్ అడ్డు పడటంతో అతన్ని దొంగలు కొట్టి చంపేస్తారు. అయితే ఇంత జరుగుతున్న భయంతో లూక్ దాక్కుని ఉండిపోతాడు. ఆ తరువాత లూక్ దానికి చాలా గిల్టీ ఫీల్ అవుతాడు. ఆరు నెలల తర్వాత, రాబ్ కి గుర్తుగా లూక్ అతని ముగ్గురు ఫ్రెండ్స్ తో కలసి స్వీడన్ అడవిలో హైకింగ్ ప్లాన్ చేస్తారు. మొదటి రోజు సరదాగా గడచిపోతుంది. ఆ తరువాత రాత్రి టెంట్‌లో లూక్‌కి రాబ్ కలలో కనిపించి, బ్లడ్ ఫేస్‌తో అరుస్తాడు. లూక్ చాలా భయపడతాడు.
Read Also : ఇద్దరమ్మాయిల మధ్య లవ్వు… ఆ సీన్లతో ఇండియాలో బ్యాన్… ఒంటరిగా చూడాల్సిన సీన్లే హైలెట్