OTT Movie : హాలీవుడ్ రొమాన్స్ అంటేనే సీన్లు ఓ రేంజ్ లో ఉంటాయి. ఇలాంటి సినిమాలకి ఫ్యాన్స్ కూడా తక్కువేమీ కాదు. ఒంటరిగా ఉన్నప్పుడు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి సినిమా ఒకటి ఓటీటీలో డిఫరెంట్ కథాంశంతో నడుస్తోంది. ఈ సినిమా ప్రధానాంగా ఫ్రెండ్‌షిప్, రొమాన్స్ థీమ్స్ తో నడుస్తుంది. ఇందులో ఇద్దరు మహిళలు వాళ్ళ కొడుకును మార్చుకుని రిలేషన్ పెట్టుకుంటారు. ఆతరువాత ఏమైందనేదే ఈ కథ. రొమాంటిక్ మూవీ లవర్స్ కి ఇది మస్ట్ వాచ్ మూవీ. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే.
“అడోర్” (Adore) 2013లో విడుదలైన ఆస్ట్రేలియన్ రొమాంటిక్ సినిమా. ఆన్ ఫాంటైన్ డైరెక్షన్‌లో నామీ వాట్స్ (లిల్), రాబిన్ రైట్ (రోజ్), జేమ్స్ ఫ్రెచ్విల్ (ఇయాన్), జావియర్ సామ్యూల్ (టామ్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2013 సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదలైంది. ఐయండిబిలో 6.2/10 రేటింగ్ ని పొందింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
ఆస్ట్రేలియా సముద్రం దగ్గర ఒక చిన్న గ్రామం. లిల్, రోజ్ అనే ఇద్దరు అమ్మాయిలు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇద్దరికీ 40 ఏళ్లు, పక్కపక్కనే ఇళ్లు, ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. లిల్ కొడుకు ఇయాన్ 18 ఏళ్లు, చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. రోజ్ కొడుకు టామ్ 18 ఏళ్లు, స్మార్ట్ గా ఉంటాడు. ఇద్దరు కొడుకులు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. నలుగురూ కలిసి సముద్రానికి వెళ్లి సర్ఫింగ్ చేస్తారు, ఫ్యామిలీ లాగా ఉంటారు. ఒక రోజు రోజ్ తన ఫ్రెండ్ కొడుకు ఇయాన్ ని చూసి అట్రాక్ట్ అవుతుంది. ఇయాన్ కూడా రోజ్‌ను ఇష్టపడతాడు. ఒక రోజు సముద్రం దగ్గర కిస్ చేసుకుంటారు, తర్వాత ఆ పని కూడా స్టార్ట్ అవుతుంది.
Read Also : నడిరోడ్డుపై ఒంటిపై నూలుపోగు లేకుండా పడుండే అమ్మాయి… చిన్న పిల్లలు చూడకూడని లీగల్ డ్రామా
లిల్ కూడా తన ఫ్రెండ్ కొడుకు టామ్ కి పడిపోతుంది. ఇప్పుడు రెండు జంటలు ఆ పనిలో ఎంజాయ్ చేస్తుంటారు. మొదట సీక్రెట్‌గా ఉంటుంది, కానీ ఇద్దరు అమ్మాయిలు ఒకరికొకరు చెప్పుకుంటారు. ఇది మన మధ్య సీక్రెట్, ఎవరికీ చెప్పకూడదని అనుకుంటారు. నలుగురూ కలిసి సముద్రానికి వెళ్లి ఎంజాయ్ చేస్తారు, రొమాన్స్ బాగా పెరుగుతుంది. కానీ సమస్యలు కూడా మొదలవుతాయి. ఇయాన్, టామ్ లకు ఒకరి గురించి ఒకరికి తెలిసి పోతుంది. దీంతో ఇయాన్, టామ్ మధ్య ఫైట్ అవుతుంది. కానీ తర్వాత అర్థం చేసుకుంటారు. నలుగురూ కలిసి సంతోషంగా కనిపిస్తారు. చివరికి ఈ సినిమా అమ్మాయిలు తమ ఇష్టాలు పాటించాలి, సొసైటీ ఏం అనుకుంటుందని భయపడకూడదనే ఒక మెసేజ్ ని ఇస్తుంది.