E-Paper
Advertisement

సిటీలో నేపాలీ గ్యాంగ్ బీభత్సం.. దంపతులకు మత్తు ఇచ్చి 60 తులాల బంగారం చోరీ!

సిటీలో నేపాలీ గ్యాంగ్ బీభత్సం.. దంపతులకు మత్తు ఇచ్చి 60 తులాల బంగారం చోరీ!
Advertisement

Nepali Gang: హైదరాబాద్ నగరంలో ఇటీవల నేపాలీ ముఠాల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పనిమనుషులుగా చేరి, యజమానుల నమ్మకాన్ని గెలుచుకుని, ఆపై అదను చూసి అందినకాడికి దోచుకుపోతున్న తీరు కలకలం రేపుతోంది. తాజాగా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ భారీ దోపిడీ ఉదంతం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది.

వివ‌రాల్లోకి వెళితే..
జవహర్‌నగర్‌లోని కౌకుర్ గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్న ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్ష్మి దంపతుల వద్ద 13 రోజుల క్రితమే ఒక నేపాలీ జంట పనిలో చేరింది. తక్కువ కాలంలోనే యజమానుల నమ్మకాన్ని పొందిన వీరు, సోమవారం రాత్రి తమ బంధువైన మరో మహిళ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటామని అనుమతి తీసుకున్నారు. ఈ వేడుకల నెపంతో బయటి నుంచి మరో ముగ్గురు వ్యక్తులను పిలిపించుకున్నారు. అంతా సజావుగా సాగుతుందనుకున్న తరుణంలో, రాత్రి భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా యజమానులపై దాడికి తెగబడ్డారు.

Advertisement

బంధించి.. మత్తు ఇచ్చి.. బీభత్సం
దుండగులు దంపతులిద్దరినీ అత్యంత క్రూరంగా కట్టేసి, వారు ప్రతిఘటించకుండా మత్తుమందు ఇచ్చారు. బాధితులు స్పృహ కోల్పోయిన తర్వాత ఇల్లంతా గాలించి సుమారు 60 తులాల బంగారం, వెండి వస్తువులతో పాటు రూ. 30 వేల నగదును దోచుకున్నారు. ఈ ముఠా పక్కా ప్లాన్‌తోనే ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పనిలో చేరిన కొద్ది రోజుల్లోనే ఇంటి గుట్టు తెలుసుకుని ఈ ఘాతుకానికి పాల్పడటం గమనార్హం.

బాధితుల ఆర్తనాదాలు.. వెలుగులోకి వచ్చిన దొంగతనం
మత్తు ప్రభావం నుంచి కోలుకున్న దంపతులు తమను తాము విడిపించుకోలేక, కిటికీలో నుంచి గట్టిగా కేకలు వేశారు. వారి అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జవహర్‌నగర్ పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. నిందితులు పారిపోయే మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

Advertisement

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్యోదంతం మరువక ముందే..
కొద్ది రోజుల క్రితమే మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే నివాసంలో పని మనిషిగా ఉన్న నేపాలీ వ్యక్తి ఆయన భార్యను అతి దారుణంగా హత్య చేసి దోపిడీకి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరవక ముందే మళ్లీ అదే తరహాలో నేపాలీ ముఠా రెచ్చిపోవడం నగరంలో ఆందోళన కలిగిస్తోంది. ఒకే తరహా నేరాలకు పాల్పడుతున్న ఈ ముఠాల వెనుక ఏదైనా వ్యవస్థీకృత నెట్‌వర్క్ ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also Read: నీట్ ‘లీక్’ రచ్చ.. సుప్రీంకోర్టుకు చేరిన లీకేజీ వివాదం.. NTA తీరుపై FAIMA ఫైర్!

నివాసితులకు పోలీసుల కీలక విన్నపం
ఇలాంటి ఘటనల నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పనిమనుషులను, సెక్యూరిటీ గార్డులను నియమించుకునేటప్పుడు వారి ఆధార్ కార్డులు, ఫోటోలు, వారి స్వస్థలాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని కోరుతున్నారు. వీలైతే వారి వివరాలను సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో అందించి ‘పోలీస్ వెరిఫికేషన్’ చేయించుకోవడం ఉత్తమమని హితవు పలుకుతున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×